మద్యం పాలసీపై చర్చ.. నేతల మధ్య మాటల యుద్ధం!

| Edited By:

Dec 16, 2019 | 6:36 PM

నేడు అసెంబ్లీలో మద్యం పాలసీపై జరిగిన చర్చలో టీడీపీ, వైసీపీ నేతల మాటల యుద్ధం జరిగింది. వైసీపీ నేతలు 20 శాతం షాపులు తగ్గిస్తామన్నారు, కానీ ఒక్కటికూడా తగ్గలేదని అచ్చెన్నాయుడు తెలిపారు. కొత్త మద్యం పాలసీ వచ్చిన తరువాత సారా తయారీ పెరిగిందని, నాన్ డ్యూటీ లిక్కర్ కూడా భారీగా వస్తోందని ఆయన విచారించారు. టీడీపీ సభను తప్పుదోవ పట్టింస్తోందని మంత్రి బుగ్గన ఆరోపించారు. అచ్చెన్నాయుడు చెప్పినవన్నీ తప్పుల తడకలని, టీడీపీకి మద్యపాన నిషేధ అమలు ఇష్టం […]

మద్యం పాలసీపై చర్చ.. నేతల మధ్య మాటల యుద్ధం!
Follow us on

నేడు అసెంబ్లీలో మద్యం పాలసీపై జరిగిన చర్చలో టీడీపీ, వైసీపీ నేతల మాటల యుద్ధం జరిగింది. వైసీపీ నేతలు 20 శాతం షాపులు తగ్గిస్తామన్నారు, కానీ ఒక్కటికూడా తగ్గలేదని అచ్చెన్నాయుడు తెలిపారు. కొత్త మద్యం పాలసీ వచ్చిన తరువాత సారా తయారీ పెరిగిందని, నాన్ డ్యూటీ లిక్కర్ కూడా భారీగా వస్తోందని ఆయన విచారించారు.

టీడీపీ సభను తప్పుదోవ పట్టింస్తోందని మంత్రి బుగ్గన ఆరోపించారు. అచ్చెన్నాయుడు చెప్పినవన్నీ తప్పుల తడకలని, టీడీపీకి మద్యపాన నిషేధ అమలు ఇష్టం లేదని బుగ్గన స్పష్టంచేశారు. టీడీపీ అబద్ధాల ఫ్యాక్టరీ అని కన్నబాబు పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో మద్యం ఏరులై పారిందని, టీడీపీ నేతలే మద్యం వ్యాపారులుగా మారారని నారాయణస్వామి ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ విధానాలకు వెన్నుపోటు పొడిచి మద్యం మాఫియాను నడిపించారని అయన పేర్కొన్నారు.

సీఎం జగన్ మాట్లాడుతూ.. 43 వేల బెల్ట్ షాపులను ఎత్తివేశామని, దాదాపు 25 శాతం షాపులు తగ్గాయని, మద్యం అమ్మకాలు 35 శాతం తగ్గాయని పేర్కొన్నారు. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు అచ్చెన్నాయుడుపై ప్రివిలేజ్ నోటీసు ఇస్తున్నామని సీఎం జగన్ వివరించారు.