జో బైడెన్ రాకతో హెచ్-1బీ వీసాలపై ఆంక్షలు రద్దు ?

| Edited By: Pardhasaradhi Peri

Nov 08, 2020 | 10:49 AM

అమెరికా నూతన అధ్యక్షునిగా పదవిని చేపట్టనున్న జోబైడెన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యంగా లక్షలాది భారతీయుల కష్టాలు, ఇబ్బందులు తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. హెచ్ 1 బీ వీసాలతో బాటు హై స్కిల్డ్ వీసాల సంఖ్యను ఆయన పెంచవచ్చునని, అలాగే ట్రంప్ ప్రభుత్వం విధించిన ఆంక్షలను రద్దు చేయవచ్చునని భావిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ పాలసీలను సైతం జో..సవరించవచ్చు. హెచ్ 1 బీ వీసాలకు సంబంధించి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయ లేదా విదేశీ భర్తలు, లేదా భార్యల వర్క్ […]

జో బైడెన్ రాకతో హెచ్-1బీ వీసాలపై ఆంక్షలు రద్దు ?
Follow us on

అమెరికా నూతన అధ్యక్షునిగా పదవిని చేపట్టనున్న జోబైడెన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యంగా లక్షలాది భారతీయుల కష్టాలు, ఇబ్బందులు తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. హెచ్ 1 బీ వీసాలతో బాటు హై స్కిల్డ్ వీసాల సంఖ్యను ఆయన పెంచవచ్చునని, అలాగే ట్రంప్ ప్రభుత్వం విధించిన ఆంక్షలను రద్దు చేయవచ్చునని భావిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ పాలసీలను సైతం జో..సవరించవచ్చు. హెచ్ 1 బీ వీసాలకు సంబంధించి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయ లేదా విదేశీ భర్తలు, లేదా భార్యల వర్క్ పర్మిట్లను ఆయన ప్రభుత్వం పునరుధ్ధరించి, గతంలో ఉన్న నిబంధనలను మార్చే సూచనలు కూడా ఉన్నాయని అంటున్నారు. ప్రధానంగా యూ ఎస్ లో జాబ్స్ చేస్తున్న లక్షలాది భారతీయ కుటుంబాలకు ఇది వరమే అవుతుంది. గ్రీన్ కార్డుల విషయంలోనూ జో ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ ని అమలు చేయవచ్చు. ఇమ్మిగ్రంట్లకు అనువుగా నగరాలు, కౌంటీలు కొత్త వీసా కేటగిరీని సృష్టించాలని జో బైడెన్ యోచిస్తున్నట్టు వార్తలందుతున్నాయి.