Bowenpally Kidnap Case: అఖిల ప్రియకు ఫిట్స్.. బెయిల్ పిటిషన్‌పై ఉత్కంఠ.. పరారీలోనే భార్గవ్ రామ్

|

Jan 07, 2021 | 9:06 AM

బోయిన్‌పల్లి సోదరుల కిడ్నాప్ వ్యవహారం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. సినీ ఫక్కీలో జరిగిన ఈ కిడ్నాప్ కేసులో ట్విస్‌ల మీద ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి.

Bowenpally Kidnap Case: అఖిల ప్రియకు ఫిట్స్.. బెయిల్ పిటిషన్‌పై ఉత్కంఠ.. పరారీలోనే భార్గవ్ రామ్
Follow us on

Bowenpally Kidnap Case: బోయిన్‌పల్లి సోదరుల కిడ్నాప్ వ్యవహారం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. సినీ ఫక్కీలో జరిగిన ఈ కిడ్నాప్ కేసులో ట్విస్‌ల మీద ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను అదుపులోకి తీసుకోవడం..ఆమెకు  14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడం చకచకా జరిగిపోయాయి. అనంతరం ఆమెను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. గురువారం అఖిల ప్రియ బెయిల్ పిటిషన్‌పై కోర్టులో విచారణ జరగనుంది. అఖిల ప్రియ గర్భవతి కావడం, ఫిట్స్ కూడా వస్తుండటంతో బెయిల్‌పై  ఉత్కంఠత నెలకుంది.  కాగా అఖిల్ ప్రియ భర్త భార్గవ్ రామ్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు 15 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

మరో నిందితుడు ఏవి సుబ్బారెడ్డికి 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చి వదిలేశారు పోలీసులు. భార్గవ్ అరెస్ట్ తర్వాత వైవి సుబ్బారెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంది.  ఐటీ అధికారులుగా ప్రవీణ్ రావు ఇంట్లో చొరబడిన వారి కోసం గాలింపు ప్రక్రియ కొనసాగుతుంది.

Also Read : Petrol, Diesel Prices Hiked: వాహనదారులకు షాక్‌.. మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు