4వ దశలో వందే భారత్ మిషన్‌.. స్వదేశానికి తెలుగువారు

|

Jul 09, 2020 | 6:54 PM

Bharat Mission Flight 4th Phase :  ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే వందే భారత్ మిషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటివకు మూడు దఫాల్లో దాదాపు 600 విమానాల ద్వారా లక్ష మందికిపైగా భారత్ కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా 4వ దశ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ దశలో 637 ఇంటర్నేషనల్ విమానాలు దేశంలోని 29 విమానాశ్రయాలకు చేరుకుంటాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ […]

4వ దశలో వందే భారత్ మిషన్‌.. స్వదేశానికి తెలుగువారు
Follow us on

Bharat Mission Flight 4th Phase :  ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే వందే భారత్ మిషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటివకు మూడు దఫాల్లో దాదాపు 600 విమానాల ద్వారా లక్ష మందికిపైగా భారత్ కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా 4వ దశ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ దశలో 637 ఇంటర్నేషనల్ విమానాలు దేశంలోని 29 విమానాశ్రయాలకు చేరుకుంటాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ దశలో మొత్తం 30 వేల మంది భారతీయులను విదేశాల నుంచి ఇక్కడికి తీసుకువస్తున్నట్లుగా వెల్లడించారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ దశ చివరి విమానం ఆగస్టు 7 న కువైట్ నుండి చెన్నైకి బయలుదేరుతుంది.