రాములవారి ఆదాయం లెక్కింపు..

భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయ హుండీల ఆదాయాన్ని లెక్కించారు. సోమవారం ఉదయం చిత్రకూట మండపంలో లెక్కింపు నిర్వహించారు అధికారులు. ఉదయం నుంచి సాయంత్రం వరకు లెక్కింపు ప్రక్రియ కొనసాగింది.

రాములవారి ఆదాయం లెక్కింపు..

Updated on: Nov 09, 2020 | 9:31 PM

Bhadrachalam : భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయ హుండీల ఆదాయాన్ని లెక్కించారు. సోమవారం ఉదయం చిత్రకూట మండపంలో లెక్కింపు నిర్వహించారు అధికారులు. ఉదయం నుంచి సాయంత్రం వరకు లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్స్‌తోపాటు సెక్యూరిటీ గార్డుల భద్రత నడుమ ఈ లెక్కింపు జరిగింది.

మొత్తం 152 రోజుల ఆదాయాన్ని ఆలయ సిబ్బందితో పాటు భక్తులు లెక్కించారు. నగదు రూపంలో రూ.66,51,895 ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. అదేవిధంగా 80 గ్రాముల బంగారం, కేజీ 200 గ్రాముల వెండి భక్తులు కానుకలుగా సమర్పించాచినట్లు వెల్లడించారు. కొవిడ్ కారణంగా భక్తుల రాక తగ్గడంతో ఆలయ ఆధాయం తగ్గిందని ఆలయ అధికారులు వెల్లడించారు. ప్రధాన ఆలయంలో హుండీలు, ఉపాలయాలలో హుండీలను ఒకేసారి లెక్కింపు జరిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us