బెజ‌వాడ రౌడీల‌పై పోలీసుల ఉక్కుపాదం..న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ అస్త్రం

బెజ‌వాడ‌లో జ‌రిగిన గ్యాంగ్ వార్..ఒక్క‌సారిగా న‌గ‌ర ప్ర‌జ‌లను ఉలిక్కిప‌డేలా చేసింది. క‌త్తులు, క‌ర్ర‌ల‌తో రెండు గ్యాంగులు బీభ‌త్సం సృష్టించాయి. ఈ ఘ‌ర్ష‌ణ‌లో తోట సందీప్ అనే మాజీ రౌడీషీట‌ర్ ప్రాణాలు కోల్పోయాడు.

బెజ‌వాడ రౌడీల‌పై పోలీసుల ఉక్కుపాదం..న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ అస్త్రం

Updated on: Jul 15, 2020 | 2:07 PM

బెజ‌వాడ‌లో జ‌రిగిన గ్యాంగ్ వార్..ఒక్క‌సారిగా న‌గ‌ర ప్ర‌జ‌లను ఉలిక్కిప‌డేలా చేసింది. క‌త్తులు, క‌ర్ర‌ల‌తో రెండు గ్యాంగులు బీభ‌త్సం సృష్టించాయి. ఈ ఘ‌ర్ష‌ణ‌లో తోట సందీప్ అనే మాజీ రౌడీషీట‌ర్ ప్రాణాలు కోల్పోయాడు. ప్రశాంతంగా ఉన్న బెజ‌వాడ‌లో ఈ అల్ల‌ర్లు అలజ‌డులు క్రియేట్ చేయ‌డంతో..పోలీసులు అలెర్ట‌య్యారు. కేసును సీరియ‌స్ గా తీసుకోని విచారించారు. గొడ‌వ‌తో సంబంధం ఉన్న‌వాళ్ల‌ను ఇప్ప‌టికే అరెస్ట్ చేశారు. అంతేకాక మొత్తం రౌడీషీట‌ర్ల ఏరివేత‌పై ఫోక‌స్ పెట్టారు పోలీసులు.

400 మందికి పైగా రౌడీషీట‌ర్లను బెజవాడ న‌గ‌రంలో గుర్తించారు. వారిలో 70 మంది ప్ర‌స్తుతం యాక్టీవ్ గా ఉన్న‌ట్లు నిర్దారించారు. రాత్రి పూట వారి క‌దలిక‌ల‌పై నిఘా పెట్టి..అతి చేస్తోన్న న‌లుగురిని న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ చేశారు. మ‌రికొంద‌ర్ని కూడా న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ కోసం లిస్ట్ ఔట్ చేశామ‌ని టీవీ9తో సీపీ శ్రీనివాసులు తెలిపారు. రౌడీషీట‌ర్ల.. గంజాయి , డ్ర‌గ్స్ సేవించ‌డంతో పాటు విద్యార్థులే లక్ష్యంగా వాటి విక్రయాలు జరుపుతున్న‌ట్టు గుర్తించారు. చాలామంది విద్యార్థులు డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారని, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి బెజ‌వాడ సీపీ సూచించారు.