Ben Stokes Career-Best Test Ranking: వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల్లో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అద్భుతమైన పెర్ఫార్మన్స్‌తో అదరగొట్టాడు. రెండో టెస్టులో తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన స్టోక్స్ టెస్ట్ ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో జోరు చూపించాడు. గత 18 నెలలుగా అగ్రస్థానంలో ఉన్న విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ (459)ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని చేజిక్కించుకున్నాడు. అటు బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో కూడా మూడో స్థానానికి చేరుకున్నాడు. ఇక రెండో టెస్టులో విజయం సాధించిన ఇంగ్లాండ్.. 40 పాయింట్లు దక్కించుకుని ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో 186 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.