భారత టీ20 ఆటగాళ్లకు గుడ్ న్యూస్ వచ్చేసింది. బీసీసీఐ తమ వార్షిక కాంట్రాక్ట్ నిబంధనలను సవరించించినట్లు తెలుస్తోంది. ఇకపై భారత్ తరఫున టీ20లు ఆడే ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్ట్ పొందవచ్చు. ఇందుకు సదరు ప్లేయర్ కనీసం పది టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. గతంలో వార్షిక కాంట్రక్ట్‌లు కేవలం వన్డే, టెస్టు ప్లేయర్స్‌కు మాత్రమే ఉండేవి.
సుప్రీంకోర్టు నియమించిన క్రికెట్ పాలకుల కమిటీ(సీఓఏ) గతంలోనే టీ20 ఫార్మాట్‌ను ఒప్పందాల్లో చేర్చాలని సూచించినా.. బోర్డు అందుకు సమ్మతించలేదు. అయితే ఇప్పుడు గంగూలీ పాలకవర్గం ఈ మార్పునకు పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం టీ20 క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం లభిస్తోంది. ఇక ప్రతి ఏటా ఐపీఎల్‌లో అదిరిపోయే ప్రతిభ చూపుతోన్న ప్రాంతీయ క్రికెటర్లను ప్రొత్సహించేందుకు గంగూలీ ఈ దిశగా అడుగులు వేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం భారతీయ క్రికెటర్లకు నాలుగు కేటగిరీల్లో కాంట్రాక్ట్‌లు ఉంటున్నాయి. ఏ+ కేటగిరీలో ఉన్నవారికి ఏడాదికి రూ.7 కోట్లు, ఏ కేటగిరిలో ఉంటే రూ.5 కోట్లు, బి కేటగిరిలో రూ.3 కోట్లు, సీ కేటగిరీలో రూ.1 కోటి వార్షిక వేతనంగా బీసీసీఐ ఇస్తుంది. అయితే ఈ కాంట్రాక్ట్‌లో చోటు దక్కించుకోవాలంటే ఆటగాడు కనీసం 3 టెస్టులు లేదా 7 వన్డేలు ఆడాల్సి ఉంటుంది. అన్ని ఫార్మాట్లో అద్బుతంగా రాణిస్తోన్నవారికి ఏ+ కేటగిరీలో చోటు కలిపిస్తారు.
Also Read :
వారెవ్వా.. అతడికి అదృష్టం ఆకాశం నుంచి ఊడిపడింది..ఒక్క రోజులో కోటీశ్వరుడు
పెంపుడు శునకంపై మితిమీరిన ప్రేమ..యువతి ఆత్మహత్య..అక్కడే పూడ్చిపెట్టాలంటూ..