‘వాళ్లిద్దరినీ పట్టించుకునేదెవరు.? జగన్ బెండు తీసే రకం’
ఢిల్లీ పెద్దల దగ్గర బెండ్ అవడం టీడీపీ అధినేత చంద్రబాబుకి, ఆయన తనయుడు లోకేష్ కి అలవాటన్నారు వైసీపీ బాపట్ల ఎంపి నందిగం సురేష్. అలాగే అందరు బెండ్ అవుతారను కొవడం వాళ్ళ భ్రమ అని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘బెండయ్యే రకం కాదు.. బెండు తీసే రకం’ అని ఆయన చెప్పుకొచ్చారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన జగన్ ను బీజేపీ నేత, కేంద్రమంత్రి అమిత్ షా మందలంచారన్న ప్రచారంలో నిజం లేదని […]
ఢిల్లీ పెద్దల దగ్గర బెండ్ అవడం టీడీపీ అధినేత చంద్రబాబుకి, ఆయన తనయుడు లోకేష్ కి అలవాటన్నారు వైసీపీ బాపట్ల ఎంపి నందిగం సురేష్. అలాగే అందరు బెండ్ అవుతారను కొవడం వాళ్ళ భ్రమ అని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘బెండయ్యే రకం కాదు.. బెండు తీసే రకం’ అని ఆయన చెప్పుకొచ్చారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన జగన్ ను బీజేపీ నేత, కేంద్రమంత్రి అమిత్ షా మందలంచారన్న ప్రచారంలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.
‘పసుపు రంగు బ్యాచ్ కి ఒక దరిద్రం పట్టింది.. వాళ్లకి జరిగిన అవమానాలే ఎదుటి వారికి కూడా జరిగాయని అనుకుంటున్నారు’. అని నందిగం కౌంటర్లు వేశారు. ‘పట్టాభి, సబ్బంహరిని ఎవరు లెక్కల్లో వేసుకున్నారు… లెక్కలో వేసుకుంటే దాడి చేస్తారు’ అంటూ వాళ్లిద్దరికీ సంబంధించి తాజాగా జరిగిన ఘటనలపై స్పందిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వాళ్లిద్దరినీ పట్టించుకునేవాళ్లే రాష్ట్రంలో లేరన్నారు ఎంపీ నందిగం.