Bank Holidays: జనవరి నెలలో బ్యాంకులకు సెలవు రోజులు ఇవే.. ముందే ప్లాన్ చేసుకుంటే బెటర్.

కొత్త ఏడాది మొదలు కాబోతోంది. మరికొన్ని రోజుల్లో కొత్తేడాదిలో అడుగుపెట్టబోతున్నాం. ఈ ఏడాది పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుండడంతో అందరూ తమ ఆర్థిక ప్రణాళికలను రచించుకునే ఆలోచనలో పడ్డారు. మరి మీరు కూడా...

Bank Holidays: జనవరి నెలలో బ్యాంకులకు సెలవు రోజులు ఇవే.. ముందే ప్లాన్ చేసుకుంటే బెటర్.

Updated on: Dec 25, 2020 | 7:41 PM

Bank holidays in january: కొత్త ఏడాది మొదలు కాబోతోంది. మరికొన్ని రోజుల్లో కొత్తేడాదిలో అడుగుపెట్టబోతున్నాం. ఈ ఏడాది పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుండడంతో అందరూ తమ ఆర్థిక ప్రణాళికలను రచించుకోవడానికి ఆలోచనలో పడ్డారు. మరి మీరు కూడా హౌజింగ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ ఇలా దేనికోసమైనా ప్లాన్ చేస్తున్నారా? మరి కొత్త ఏడాది మొదటి నెలలో బ్యాంకులు ఏ ఏ రోజుల్లో పనిచేస్తున్నాయి, సెలవులు ఎప్పుడో తెలుసుకోవాలని ఉందా…
ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ తాజాగా జనవరి నెలలో రానున్న సెలవులను ప్రకటించింది. ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాలు కాకుండా ఈ కింది రోజుల్లో కూడా బ్యాంకులు పనిచేయవు. దీన్ని బట్టి మీ కార్యక్రమాలను ప్లాన్ చేసుకోండి మరి..
జనవరి 1: న్యూ ఇయర్.
జనవరి 2: నూతన సంవత్సర వేడుక సెలవు
జనవరి 14: మకర సంక్రాంతి / పొంగల్ / మాఘే సంక్రాంతి
జనవరి 15: తిరువల్లూవర్ డే / మాగ్ బిహు, తుసు పూజ
జనవరి 16: ఉజవర్ తిరునాల్
జనవరి 23: నేతాజీ సుభాస్ చంద్రబోస్ జయంతి
జనవరి 25: ఇమోయిను ఇరత్పా
జనవరి 26: గణతంత్ర దినోత్సవం
అయితే కొన్ని రాష్ట్రాల ప్రాధాన్యతలబట్టి ఈ సెలవుల్లో కొన్ని మార్పులు ఉంటాయి. స్థానిక పండగల సెలవులపై రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలమేరకు బ్యాంకులు నిర్ణయం తీసుకుంటాయి