హిమాచల్ ప్రదేశ్ నూతన గవర్నర్‌గా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో సిమ్లాలోని రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం కార్యక్రమ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. మంగళవారం సాయంత్రం సిమ్లాకు చేరుకున్న దత్తాత్రేయను.. హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ స్వాగతం పలికారు. అంతకుముందు హిమాచల్‌ప్రదేశ్ రాజ్‌భవన్ ఏడీసీ మోహిత్‌చావ్లా.. హైదరాబాద్‌లోని దత్తాత్రేయ నివాసానికి చేరుకుని గవర్నర్ నియామక ఉత్తర్వులను అందజేశారు. దత్తాత్రేయతో పాటు తెలంగాణ బీజేపీ లీడర్లు కూడా వెళ్లారు. వెళ్లిన వారిలో ఇంద్రసేనా రెడ్డి, మల్లా రెడ్డి, డీకే అరుణ తదితరులు ఉన్నారు.