హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌పై గుర్తుతెలియని దుండగులు ఆదివారం రాత్రి రాళ్లతో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, దాడికి పాల్పడిన ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ దాడిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. వారిని అడ్డుకోడానికి ప్రయత్నించిన సురేందర్‌పై కూడా దాడికి పాల్పడ్డారు. సీసీ ఫుటేజీ ద్వారా నిందితులను పాతబస్తిలోని ఛత్రినాక వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ రోజు ఉదయం నారాయణగూడ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి, నిందితులను విచారిస్తున్నారు.
Also Read :
విషాదం : చిన్నారి ప్రాణం తీసిన బిస్కెట్
ఏపీలో కుండపోత వర్షం, ఈ జిల్లాలకు అలర్ట్