రాష్ట్ర అసెంబ్లీలో తాము విశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెడతామని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. తమ ప్రభుత్వంపై బీజేపీ అవిశ్వాస తీర్మానాన్ని తెస్తుందని అందిన సమాచారంపై ఆయన స్పందిస్తూ.. మేమూ దాన్ని దీటుగా ఎదుర్కొంటామన్నారు. విశ్వాస తీర్మానాన్ని గెహ్లాట్ ప్రవేశపెడితే.. నిబంధనల ప్రకారం.. అవిశ్వాస తీర్మానం రద్దయినట్టే.. అసమ్మతి నేతగా ఉన్న సచిన్ పైలట్ కూడా ఇప్పుడు తమతో సయోధ్య కుదుర్చుకున్నారు గనుక గెహ్లాట్ ధైర్యంగా ఉన్నారు. సచిన్ తో బాటు ఇక రెబెల్ ఎమ్మెల్యేలు కూడా మద్దతునిస్తే గెహ్లాట్ బలం సభలో 125 కి పెరుగుతుంది. పైగా ఆరుగురు మాజీ బీఎస్పీ ఎమ్మెల్యేలు కూడా తనకే మద్దతునిస్తారని ఆయన ఆశిస్తున్నారు.