ఆర్టికల్ 370 రద్దుపై.. సినీ ప్రముఖులు ఏమన్నారంటే.?

ఆర్టికల్ 370 రద్దుకు రాజకీయ నేతలతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా మద్దతు ప్రకటించారు. సోషల్ మీడియా ద్వారా తమ మద్దతు తెలియజేశారు. న్యూయార్క్‌లో నిద్రలేచే సరికి తన జీవితంలో గొప్ప శుభవార్త విన్నానని బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు అనుపమ్ ఖేర్ చెప్పారు. తన ఆటోబయోగ్రఫీ విడుదలైన రోజే ఈ నిర్ణయం వెలువడటం అద్భుతమైన బహుమతి అని.. భారత్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. ఆర్టికల్‌ 370 రద్దు అంశం ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో […]

ఆర్టికల్ 370 రద్దుపై.. సినీ ప్రముఖులు ఏమన్నారంటే.?
Follow us

| Edited By:

Updated on: Aug 05, 2019 | 8:43 PM

ఆర్టికల్ 370 రద్దుకు రాజకీయ నేతలతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా మద్దతు ప్రకటించారు. సోషల్ మీడియా ద్వారా తమ మద్దతు తెలియజేశారు. న్యూయార్క్‌లో నిద్రలేచే సరికి తన జీవితంలో గొప్ప శుభవార్త విన్నానని బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు అనుపమ్ ఖేర్ చెప్పారు. తన ఆటోబయోగ్రఫీ విడుదలైన రోజే ఈ నిర్ణయం వెలువడటం అద్భుతమైన బహుమతి అని.. భారత్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు.

ఆర్టికల్‌ 370 రద్దు అంశం ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉంది. భారత్‌ను ఉగ్రవాదరహిత దేశంగా మార్చడంలో ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం అంటూ నటి కంగనారనౌత్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ధైర్యసాహసాలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం కేవలం మోదీకే సాధ్యం. ఈ శుభసందర్భంలో జమ్మూకశ్మీర్‌ ప్రజలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇక నుంచి జమ్మూకశ్మీర్‌ వాసులకు మంచి భవిష్యత్‌ ఉంటుందని ఆకాంక్షిస్తున్నట్లు తాను ట్వీట్ చేశారు. లడఖ్‌, జమ్మూకశ్మీర్‌ ప్రజల శాంతి, శ్రేయస్సు, సుస్థిరమైన అభివృద్ధికి తీసుకున్న నిర్ణయం. ఆ ప్రాంతాల ప్రజలకు గుడ్‌ లక్‌ అంటూ నటి దియా మీర్జా ట్వీట్‌ చేసింది. ట్విట్టర్ లో జాతీయ జెండా చిత్రాలను పోస్ట్ చేసి జమ్మూకశ్మీర్ ప్రజలకు తన విషెస్ నందించారు బాలీవుడ్ నటి రవీనాటాండన్.

View this post on Instagram

#KanganaRanaut on #Article370: It’s a historic step in the direction of terrorism free nation!

A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on