కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌కు అరెస్ట్‌ వారెంట్!

కాంగ్రెస్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌కు కోల్‌కత్తా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టు అరెస్ట్‌ వారెంట్ జారీ చేసింది. శశిథరూర్ హిందూ-పాకిస్తాన్ పేరుతో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని.. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని అడ్వకేట్ సుమీత్ చౌదరి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో శశిథరూర్‌కు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీపై శశిథరూర్ చేసిన వ్యాఖ్య వివాదాస్పదంగా మారింది. బీజేపీకి మళ్లీ అధికారాన్ని కట్టబెడితే.. రాజ్యాంగాన్ని కొత్తగా రాస్తుందని.. దానివల్ల హిందూ పాకిస్తాన్ […]

కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌కు అరెస్ట్‌ వారెంట్!
TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 13, 2019 | 8:45 PM

కాంగ్రెస్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌కు కోల్‌కత్తా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టు అరెస్ట్‌ వారెంట్ జారీ చేసింది. శశిథరూర్ హిందూ-పాకిస్తాన్ పేరుతో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని.. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని అడ్వకేట్ సుమీత్ చౌదరి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో శశిథరూర్‌కు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీపై శశిథరూర్ చేసిన వ్యాఖ్య వివాదాస్పదంగా మారింది. బీజేపీకి మళ్లీ అధికారాన్ని కట్టబెడితే.. రాజ్యాంగాన్ని కొత్తగా రాస్తుందని.. దానివల్ల హిందూ పాకిస్తాన్ ఏర్పడుతుందని శశిథరూర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ వ్యాఖ్యలపైనే అడ్వకేట్‌ సుమిత్ చౌదరి కోల్‌కతా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టును ఆశ్రయించారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu