సరిహద్దులో పాక్ కాల్పులు.. భారత జవాన్ దుర్మరణం

|

Oct 01, 2020 | 12:41 PM

పాక్ వక్రబుద్ధి మారలేదు. మరోసారి సరిహద్దు ఎల్ఓసీ వెంబడి బరి తెగించింది. మరోసారి కవ్వింపులకు పాల్పడింది.

సరిహద్దులో పాక్ కాల్పులు.. భారత జవాన్ దుర్మరణం
Follow us on

పాక్ వక్రబుద్ధి మారలేదు. మరోసారి సరిహద్దు ఎల్ఓసీ వెంబడి బరి తెగించింది. మరోసారి కవ్వింపులకు పాల్పడింది. పాకిస్థాన్ సైనికులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో భారత ఆర్మీ జవాన్ దుర్మరణం పాలవ్వగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూకశ్మీరులోని సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ సైనికులు కాల్పులు జరిపారు. జమ్మూకశ్మీరులోని పూంచ్ జిల్లా కృష్ణ ఘాటీ సెక్టారులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భారత సైనిక విభాగానికి చెందిన లాన్స్ నాయక్ కర్నాల్ సింగ్ అమరుడయ్యారు. పాక్ సైనికుల కాల్పులను భారత సైనికులు సమర్ధవంతంగా తిప్పికొట్టారు. పాక్ కాల్పుల్లో అమరుడైన లాన్స్ నాయక్ కర్నాల్ సింగ్ కు భారత సైనికులు ఘనంగా నివాళులు అర్పించారు. పాక్ కాల్పులను భారత సైనికులు సమర్ధంగా తిప్పి కొట్టారని రక్షణ శాఖ పౌరసంబంధాలశాఖ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ చెప్పారు.