20 మంది అమరవీరుల స్మృతికి చిహ్నంగా లడాఖ్ లో మెమోరియల్

| Edited By: Pardhasaradhi Peri

Oct 03, 2020 | 7:05 PM

గత జూన్ 15 న గాల్వన్ లోయలో చైనా దళాలతో జరిగిన ఘర్షణలో అమరులైన 20 మంది జవాన్ల స్మృత్యర్థం లడాఖ్ లో సైన్యం స్మారకాన్ని (మెమోరియల్) నిర్మించింది. 'గ్యాలంట్స్ ఆఫ్ గాల్వన్..

20 మంది అమరవీరుల స్మృతికి చిహ్నంగా లడాఖ్ లో మెమోరియల్
Follow us on

గత జూన్ 15 న గాల్వన్ లోయలో చైనా దళాలతో జరిగిన ఘర్షణలో అమరులైన 20 మంది జవాన్ల స్మృత్యర్థం లడాఖ్ లో సైన్యం స్మారకాన్ని (మెమోరియల్) నిర్మించింది. ‘గ్యాలంట్స్ ఆఫ్ గాల్వన్’ పేరిట ఈ స్మారకాన్ని నిర్మించినట్టు ఆర్మీ తెలిపింది. ఈ లోయలో చైనా దళాలను ధైర్య సాహసాలతో ఎదిరించి వారిని ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించిన ఈ జవాన్లను తాము సదా స్మరించుకుంటామని సైనికాధికారులు తెలిపారు. కాగా నాటి ఘర్షణలో ఎంతమంది చైనా సైనికులు గాయపడిందీ లేదా  మరణించిందీ ఇప్పటివరకు స్పష్టంగా తెలియలేదు. అయితే 35 మంది మృతి చెందినట్టు అమెరికన్ ఇంటెలిజెన్స్ రిపోర్టు పేర్కొంది.