బిగ్‌బాస్ హౌస్‌లోని హైబ్రిడ్ పిల్లా అరియానా అదరగొడుతోంది. టాస్కుల్లో తన బెస్ట్ పర్ఫామెన్స్‌ను ఇస్తూ… టాప్ 5 లక్ష్యంగా దూసుకుపోతోంది. అయితే గత రెండు ఎపిసోడ్లుగా అరియానా డల్‌గా కనిపించింది. దానికి కారణం సోహైల్ తో గొడవ, కానీ, బిగ్‌బాస్ ప్రేక్షకులను డైరెక్టుగా ఓట్ చేయమని కోరే అవకాశం కోసం ఇచ్చిన మూడు టాస్కుల్లో రెండింటిలో అరియానే విజేతగా నిలిచింది. ఆటలో అదరగొడుతోంది.
బిగ్‌బాస్ చివరి నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్ల ప్రేక్షకులను తమకు ఓటు వేయమని అడిగే అవకాశాన్ని బిగ్‌బాస్ ఇచ్చాడు. ఇందుకోసం మూడు టాస్కులు ఇవ్వగా సహనం, ఏకాగ్రత రెండు టాస్కుల్లోనూ అరియానా గెలిచి సంచలనం సృష్టించింది. ఏకాగ్రత టాస్కులో అందరి కంటే ఎక్కువగా 37 నిమిషాల సమయాన్ని లెక్కపెట్టడంతో విజేతగా నిలిచింది. గోల్డెన్ మైక్ చేత పట్టుకుని ప్రేక్షకులను తనకు ఓట్ చేయమని అడిగింది. నేనంటే కొద్దిగా ఇష్టం, కొద్దిగా కష్టమైన అయిన వారికి ఐ లవ్ యూ చెప్పింది. ఏకాగ్రత టాస్కు అరియానా గెలవడంతో సోహైల్, అఖిల్ షాక్ లో ఉన్నారు.