‘ఉల్లి’ పాయే ‘గుడ్డు’ వచ్చే.. ధర చూస్తే షాకే!

| Edited By:

Dec 13, 2019 | 4:05 PM

గత కొద్ది రోజుల నుంచీ దేశ్యవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరిగి… ప్రజలను హడలెత్తిస్తోన్న విషయం తెలిసిందే. దాదాపు కేజీ 200 రూపాయలు పెరిగి.. కొండెక్కి కూర్చొంది ఉల్లి. దీంతో.. చాలా మంది ఉల్లి పాయలని కొనడం మానేశారు. ఇప్పుడు ఇదే బాట పడుతోన్నాయి కోడిగుడ్ల ధరలు. దాదాపు ఒక్కో కోడిగుడ్డు 10 రూపాలు పెరిగే ఛాన్స్ ఉందట. దీంతో.. ఇవి కూడా కొనే పరిస్థితి ఉంటుందో.. లేదో.. అనే సందేహం కలుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఉల్లిని సబ్సీడీగా […]

ఉల్లి పాయే గుడ్డు వచ్చే.. ధర చూస్తే షాకే!
Follow us on

గత కొద్ది రోజుల నుంచీ దేశ్యవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరిగి… ప్రజలను హడలెత్తిస్తోన్న విషయం తెలిసిందే. దాదాపు కేజీ 200 రూపాయలు పెరిగి.. కొండెక్కి కూర్చొంది ఉల్లి. దీంతో.. చాలా మంది ఉల్లి పాయలని కొనడం మానేశారు. ఇప్పుడు ఇదే బాట పడుతోన్నాయి కోడిగుడ్ల ధరలు. దాదాపు ఒక్కో కోడిగుడ్డు 10 రూపాలు పెరిగే ఛాన్స్ ఉందట. దీంతో.. ఇవి కూడా కొనే పరిస్థితి ఉంటుందో.. లేదో.. అనే సందేహం కలుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఉల్లిని సబ్సీడీగా అందించినా.. అవి అందరికీ అందడం లేదు. తోపులాట్లు… కొట్లాటలతో.. కొందరు ప్రాణాలను కూడా వదులుతున్నారు.

కాగా.. ఇప్పటికే.. ఒక కోడిగుడ్డు కొన్ని ప్రాంతాల్లో 5 నుంచి 6 రూపాయలుగా ఉంది. ఇప్పుడు దీని ధర 10 రూపాయలు కానుందట. ఇప్పటికే.. పెరిగిన ధరలతో.. అంగన్‌వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం కింద అందిస్తోన్న కోడుగుడ్లు మాయమయ్యాయి. గుడ్ల ధరలు పెరగడంతో.. వాటిని మెనూ నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు.

వీటికి కారణమేంటంటే.. పౌల్ట్రీ రంగాలు నష్టాల్లో కూరుకుపోయాయట. ఈ పౌల్ట్రీ రంగం ద్వారా రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొనవలసి వస్తోందని వారు వాపోతున్నారు. ఈ కారణంగానే చాలా కోళ్ల ఫారాలు మూత పడిపోయాయి. అలాగే.. కోళ్లకు ఆహారంగా అందించే రేట్లు కూడా పెరిగాయి. కొన్ని కోళ్లు.. అనారోగ్యంతో మృతి చెందుతుండటంతొ.. ఇవన్నీ రైతులకు భారంగా మారాయి. దీంతో.. కోడిగుడ్ల రేట్లను పెంచాలని.. వారు నిరసన చేస్తున్నారు. దేశంలో అత్యధికంగా రెండు తెలుగు రాష్ట్రాలు కోడిగుడ్లను ఉత్పత్తి చేస్తున్నాయి. 8,300 కోట్ల.. గుడ్లు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి వస్తున్నాయి.

ఇప్పుడు ఈ రేటు పెంచడంతో.. రైతులు లాభపడినా.. వినియోగదారులు మాత్రం చుక్కలు చూడాల్సి వస్తుంది. ఇప్పటికే ఉల్లి సహా నిత్యవసర ధరలు పెరిగి.. ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇక కోడిగుడ్ల ధర కూడా పెరిగితే.. ఇక మధ్యతరగతి కుటుంబాలు ఎలా సాగుతాయో.. చూడాలి.