టీ-సేవా కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోండి ఇలా..

నిరుద్యోగ యువకులు స్వయం ఉపాధి పొందేందుకు తెలంగాణ ప్రభుత్వం టీ సేవ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. టీ-సేవా ఆన్‌లైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందడానికి అవకాశం..

టీ-సేవా కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోండి ఇలా..

Updated on: Jul 09, 2020 | 11:43 AM

applications invited to set up T-SEVA centres : నిరుద్యోగ యువకులు స్వయం ఉపాధి పొందేందుకు తెలంగాణ ప్రభుత్వం టీ సేవ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. టీ-సేవా ఆన్‌లైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందడానికి అవకాశం కల్పిస్తోంది. ఇందుకు అర్హత, ఆసక్తిగల అభ్యర్థుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు టీ-సేవా సెంటర్‌ డైరెక్టర్‌ అడపవెంకట్‌రెడ్డి తెలిపారు. టీ సేవ ద్వారా వినియోగదారులకు బస్, ట్రైన్ టికెట్లు బుక్ చేయడం, బిల్లులు కట్టడం వంటి సేవలను అందించవచ్చన్నారు.

స్వర్ణ తెలంగాణ స్వయం ఉపాధి పథకం కింద దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓబీసీలు ఆర్థికంగా వెనకబడిన అభ్యర్థులు, దివ్యాంగులు, పదవీ విరమణ చేసిన సైనికులు, మహిళలకు 25శాతం రిజిస్ర్టేషన్‌ ఫీజులో ప్రత్యేక రాయితీ ఇస్తామన్నా రు. ఈ నెల 25లోపు  http://www.tsevacentre.com ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. పూర్తి వివరాలకు ఫోన్‌ నెం.8179955744ను సంప్రదించాలని వెంకట్‌రెడ్డి తెలిపారు.