ఏపీ విద్యార్థుల‌కు అలెర్ట్ : సెలవుల తగ్గింపు… తరగతుల సమయం పెంపు

|

Jun 02, 2020 | 4:33 PM

కోవిడ్-19 కారణంగా అక‌డ‌మిక్ ఇయ‌ర్ ప్రారంభంలో జాప్యం జరిగినందున క్లాసెస్ సమయాన్ని రోజుకు గంట నుంచి రెండు గంటల వరకు పెంచనున్నారు.

ఏపీ విద్యార్థుల‌కు అలెర్ట్ : సెలవుల తగ్గింపు... తరగతుల సమయం పెంపు
Follow us on

ఉన్నత విద్యా సంస్థలకు ఉమ్మడి అకడమిక్‌ క్యాలెండర్‌ను ఉన్నత విద్యామండలి రూపొందించింది. డిగ్రీ, పీజీ చదివే సెకండ్, థ‌ర్డ్ ఇయ‌ర్ స్టూడెంట్స్ కు ఆగస్టులో క్లాసెస్ స్టార్ట్ కానున్నాయి. ఫ‌స్ట్ ఇయ‌ర్ విద్యార్థులకు సెప్టెంబరులో క్లాసెస్ నిర్వ‌హిస్తారు. కోవిడ్-19 కారణంగా అక‌డ‌మిక్ ఇయ‌ర్ ప్రారంభంలో జాప్యం జరిగినందున క్లాసెస్ సమయాన్ని రోజుకు గంట నుంచి రెండు గంటల వరకు పెంచనున్నారు.

ప్రతి శనివారం కూడా సెలవులు లేకుండా క్లాసెస్ చెబుతారు. పండగల సెలవులను చాలావ‌ర‌కు తగ్గించనున్నారు. ఆగస్టు నుంచి మే వరకు కాలేజీలు, వర్సిటీలు పనిచేసేలా అకడమిక్‌ క్యాలెండర్‌ రూపొందించారు. 2021-22 అక‌డ‌మిక్ ఇయ‌ర్ యథావిధిగా ఉండేలా ప్రణాళిక రూపొందించారు. జులైలో డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ ఫైన‌ల్ ఇయ‌ర్ స్టూడెంట్స్ కు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. మిగతా విద్యార్థులకు క్లాసెస్ స్టార్ట్ చేశాక‌ నిర్వహించడంపై ఆలోచిస్తున్నారు. ఇంజినీరింగ్‌ సీట్లకు ఆగస్టులో కౌన్సెలింగ్ ఏర్పాటు చేయ‌నున్నారు. ఆ తర్వాత సెప్టెంబరులో డిగ్రీ ఫ‌స్ట్ ఇయ‌ర్ ప్రవేశాలు నిర్వహిస్తారు.