ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సంచలన నిర్ణయం, ఇద్దరు ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను విధుల నుంచి తొలగింపు

రేపు పంచాయతీ తొలిదశ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోన్న రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో...

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సంచలన నిర్ణయం, ఇద్దరు ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను విధుల నుంచి తొలగింపు

Edited By:

Updated on: Jan 22, 2021 | 10:22 PM

రేపు పంచాయతీ తొలిదశ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఇద్దరు ఐఎఎస్, ఐపిఎస్ అధికారుల్ని ఎన్నికల విధుల నుంచి తొలగించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించే చర్యల్లో భాగంగానే ఈ చర్యలకు ఉపక్రమించినట్టు నిమ్మగడ్డ వివరణ ఇచ్చారు. వీరిలో గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లు కూడా ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో ఎన్నికల విధులకు సంబంధిత జాయింట్ కలెక్టర్లకు ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల విధుల నుంచి తప్పించిన వాళ్లలో ఇంకా, తిరుపతి అర్బన్ ఎస్పీ, పలమనేరు డిప్యూటీ ఎస్పీ, శ్రీకాళహస్తి డిప్యూటీ ఎస్పీ, మాచెర్ల, పుంగనూర్, రాయదుర్గం, తాడిపత్రి సర్కిల్ ఇన్స్‌పెక్టర్లు ఉన్నారు.  ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్న ఎస్ఈసీ, రేపు ఉదయం 10 గంటలకు నిమ్మగడ్డ ప్రెస్ మీట్