సీఎం మీద మతమార్పిడి ఆరోపణలు చేయడం దారుణం.. జగన్మోహన్ రెడ్డి అప్పుడే డిసైడయ్యారన్న మంత్రి కొడాలి నాని

కృష్ణానది కరకట్టమీద గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్రమంగా నిర్మించిన ప్రజా వేదికని కూల్చినప్పుడే, పేదలకు ఇళ్ల పట్టాలివ్వాలని..

సీఎం మీద మతమార్పిడి ఆరోపణలు చేయడం దారుణం.. జగన్మోహన్ రెడ్డి అప్పుడే డిసైడయ్యారన్న మంత్రి కొడాలి నాని

Updated on: Jan 07, 2021 | 7:47 PM

కృష్ణానది కరకట్టమీద గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్రమంగా నిర్మించిన ప్రజా వేదికని కూల్చినప్పుడే, పేదలకు ఇళ్ల పట్టాలివ్వాలని సీఎం జగన్‌ డిసైడ్ అయ్యారని మంత్రి కొడాలి నాని చెప్పారు. గన్నవరంలో ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నానితో పాటు ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాల్గొన్నారు. కార్యక్రమంలో మహిళలకు ఇళ్లపట్టాలు అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షలమంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందిస్తున్నామన్నారు.

ప్రజల ఆశీస్సులతో జగన్‌ 30ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండిపోతారన్న భయంతోనే… ఆలయాలను ధ్వంసం చేస్తూ చంద్రబాబు మత రాజకీయాలు చేస్తున్నారని నాని ఆరోపించారు. తన రక్తసంబంధీకుల ఆచార వ్యవహారాలను గౌరవించే ముఖ్యమంత్రిపై..మతమార్పిడి ఆరోపణలు చేయడం దారుణమన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ముఖ్యమంత్రినేమీ చేయలేరన్నారు కొడాలి నాని.