ఏపీ ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ తేదీ ఖరారు.. ఈసారి కొత్త విధానంలో సీట్ల కేటాయింపు.

|

Dec 25, 2020 | 9:39 PM

ఏపీలో ఐఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్ తేదీలను అధికారులు తాజాగా ప్రకటించారు. జనవరి 4 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభంకానున్నట్లు తెలిపారు.

ఏపీ ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ తేదీ ఖరారు.. ఈసారి కొత్త విధానంలో సీట్ల కేటాయింపు.
Follow us on

Ap iiit counselling dates: ఏపీలో ఐఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్ తేదీలను అధికారులు తాజాగా ప్రకటించారు. జనవరి 4 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభంకానున్నట్లు తెలిపారు. రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ఐటీల్లో సీట్ల కేటాయింపు కోసం ఈ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
సాధారణంగా ప్రతీ ఏటా.. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలు నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు జరగలేదు. దీంతో ప్రవేశాల కోసం ప్రత్యేక పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ప్రవేశ పరీక్ష నిర్వహించిన అధికారులు ఫలితాలను సైతం విడుదల చేశారు. ప్రస్తుతం ఈ మార్కుల ఆధారంగానే కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.