ఏపీ ప్రభుత్వం సంచలనం.. 48 ప్రైవేట్ కాలేజీల అనుమతులు రద్దు..

AP Higher Education: ప్రైవేట్ డిగ్రీ కాలేజీల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలు పాటించకుండా కొనసాగుతున్న 48 ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అనుమతులను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీలక ప్రకటనను విడుదల చేసింది. యూనివర్సిటీల అఫ్లియేషన్ లేకుండానే కొనసాగిస్తుండటం.. ఎలాంటి ప్రవేశాలు లేకుండానే కళాశాలలను నిర్వహిస్తుండటం.. అలాగే అడ్మిషన్లు 25 శాతం కంటే తక్కువగా ఉండటం లాంటే కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 246 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఉన్నట్లు ఉన్నత […]

ఏపీ ప్రభుత్వం సంచలనం.. 48 ప్రైవేట్ కాలేజీల అనుమతులు రద్దు..

Updated on: Nov 04, 2020 | 9:40 PM

AP Higher Education: ప్రైవేట్ డిగ్రీ కాలేజీల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలు పాటించకుండా కొనసాగుతున్న 48 ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అనుమతులను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీలక ప్రకటనను విడుదల చేసింది. యూనివర్సిటీల అఫ్లియేషన్ లేకుండానే కొనసాగిస్తుండటం.. ఎలాంటి ప్రవేశాలు లేకుండానే కళాశాలలను నిర్వహిస్తుండటం.. అలాగే అడ్మిషన్లు 25 శాతం కంటే తక్కువగా ఉండటం లాంటే కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 246 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఉన్నట్లు ఉన్నత విద్యామండలి గుర్తించింది. ఆయా కళాశాలలు అన్నింటికీ కూడా షోకాజ్ నోటిసులు జారీ చేసింది.

ఆ నోటీసులకు వివరణ ఇస్తూ.. కాలేజీ యాజమాన్యాలు విచారణకు రావాలని ఆదేశించింది. కొన్ని కళాశాలలు సంబంధిత డాక్యుమెంట్స్‌తో ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేసిన విచారణ కమిటీ ముందు హాజరై సమాధానాన్ని తెలపగా… మరికొన్ని కాలేజీలు స్పందించలేదు. దీనితో కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా 48 ప్రైవేట్ డిగ్రీ కాలేజీల అనుమతులు పూర్తిగా రద్దు చేసిన ఉన్నత విద్యా మండలి.. మరో 61 డిగ్రీ కాలేజీలలోని కొన్ని ప్రోగ్రామ్స్‌ను ఉపసంహరించింది.