24 గంటల్లో కేంద్రానికి చేరిన మండలి రద్దు తీర్మానం

| Edited By: Pardhasaradhi Peri

Jan 28, 2020 | 5:36 PM

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్ఆర్సిపి ప్రభుత్వం సోమవారం రాష్ట్ర శాసనమండలిని రద్దుకు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని కేంద్ర కేబినెట్ కార్యదర్శి, న్యాయ శాఖ, కేంద్ర ఎన్నికల కమిషన్ కు పంపింది. కేంద్ర కేబినెట్ సమావేశంలో చర్చ తరువాత, రాజ్యాంగ అధికరణ 169(1) ప్రకారం మండలి రద్దుకు పార్లమెంట్‌లో కేంద్రం బిల్లును ప్రవేశపెట్టనుంది. తరువాత అధ్యక్షుడి సమ్మతితో కౌన్సిల్ రద్దు తీర్మానం అమల్లోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణకు సంబంధించిన రెండు బిల్లులను […]

24 గంటల్లో కేంద్రానికి చేరిన మండలి రద్దు తీర్మానం
Follow us on

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్ఆర్సిపి ప్రభుత్వం సోమవారం రాష్ట్ర శాసనమండలిని రద్దుకు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని కేంద్ర కేబినెట్ కార్యదర్శి, న్యాయ శాఖ, కేంద్ర ఎన్నికల కమిషన్ కు పంపింది. కేంద్ర కేబినెట్ సమావేశంలో చర్చ తరువాత, రాజ్యాంగ అధికరణ 169(1) ప్రకారం మండలి రద్దుకు పార్లమెంట్‌లో కేంద్రం బిల్లును ప్రవేశపెట్టనుంది. తరువాత అధ్యక్షుడి సమ్మతితో కౌన్సిల్ రద్దు తీర్మానం అమల్లోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణకు సంబంధించిన రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిన తరువాత ఏపీ ప్రభుత్వం రాష్ట్ర శాసనమండలి రద్దుకు మొగ్గుచూపింది.