AP Corona Helpline Number: కరోనా పాజిటివ్ వస్తే ఏం చేయాలి.? ఎవరిని సంప్రదించాలి.? ఎక్కడికి వెళ్ళాలి.? ఇప్పటివరకు ఈ ప్రశ్నలకు సమాధానాలు చాలామంది ప్రజలకు తెలియదు. ఇక అలాంటివారి కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ హెల్ప్ లైన్ నెంబర్(8297104104)ను ఏర్పాటు చేసింది. కరోనా వైరస్ నిర్ధారణ, చికిత్సకు అందుబాటులో ఉన్న వసతులు, రాష్ట్రంలోని కోవిడ్ ఆసుపత్రులు, ఇతరత్రా విషయాలపై ప్రజలకు సమాచారం అందించేందుకు ఈ హెల్ప్‌లైన్ నెంబర్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు అంటున్నారు.
టెలీ మెడిసిన్, 104 కాల్ సెంటర్ వివరాలతో పాటు హోం ఐసోలేషన్‌లో ఉండేవాళ్లు ఏం చేయాలి.? పాజిటివ్ నిర్ధారణ అయిన తర్వాత కరోనా సెంటర్లలో లేదా ఆసుపత్రిలో చేరాలంటే ఏం చేయాలి.? లాంటి సందేహాలన్నింటిని కూడా ఈ హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా ప్రజలు నివృత్తి చేసుకోవచ్చునని అధికారులు స్పష్టం చేశారు. కాగా, ఏపీలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండు లక్షల 50 వేల మార్క్ దాటింది. అటు వైరస్ కారణంగా 2296 మంది మరణించగా.. 1,61,425 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
Also Read:
తెలంగాణలో కొత్తరకం వ్యాధి.. ఆదిలాబాద్‌లో మొదటి కేసు నమోదు.
గ్రామ సచివాలయ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పరీక్షల తేదీలు ఖరారు.!
ఏపీలోని ఆ ప్రాంతంలో రెండు వారాల కఠిన లాక్‌డౌన్..