జగన్ కీలక నిర్ణయం.. మరిన్ని కరోనా వైద్య ప్రక్రియలు ఆరోగ్య శ్రీ పరిధిలోకి..

| Edited By:

Jul 09, 2020 | 6:14 AM

Corona medical fee in private hospitals: కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా కరోనా వైద్యానికయ్యే ఫీజులను నిర్ధారిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వసూలు చేసే ఫీజులపై వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌ రెడ్డి బుధవారం రోజున […]

జగన్ కీలక నిర్ణయం.. మరిన్ని కరోనా వైద్య ప్రక్రియలు ఆరోగ్య శ్రీ పరిధిలోకి..
Follow us on

Corona medical fee in private hospitals: కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా కరోనా వైద్యానికయ్యే ఫీజులను నిర్ధారిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వసూలు చేసే ఫీజులపై వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌ రెడ్డి బుధవారం రోజున ఉత్తర్వులు జారీ చేశారు.

కరోనా అనుమానితులతో పాటు పాజిటివ్ వచ్చిన వారికి కూడా ఆరోగ్య శ్రీ పథకం కింద చికిత్స అందజేయనున్నారు. నాన్‌ క్రిటికల్‌ కరోనా పేషేంట్ల వైద్యానికి రోజుకి 3,250 రూపాయలుగా నిర్ధారించింది. క్రిటికల్‌ కోవిడ్‌-19 పేషెంట్లకు ఐసీయూలో వెంటిలేటర్లు, ఎన్‌ఐవీ లేకుండా ఉంచితే రోజుకి 5,480 రూపాయలు ఫీజుగా నిర్ణయించారు. ఎన్‌ఐవీతో ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తే రోజుకి రూ. 5,980 ఛార్జ్‌ చేయనున్నారు. వెంటిలేటర్‌ పెట్టి వైద్యం అందిస్తే రోజుకి 9,580గా నిర్ధారించారు.

కోవిద్-19 సంక్రమణ ఉన్నవారికి వెంటిలేటర్‌ లేకుండా వైద్యం అందిస్తే రోజుకి రూ. 6,280గా ఉండనుంది. ఇన్ఫెక్షన్ ఉండి, వెంటిలేటర్ పెట్టి వైద్యం అందిస్తే రోజుకి రూ.10,380 ఫీజు వసూలు చేయనున్నారు. ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ పరిధిలోని ఆస్పత్రులన్నీ ఇవే ఫీజులను వసూలు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.