New Traffic Violation Penalties: రోడ్డు ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్త మోటార్ వాహన చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టం ప్రకారం వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే భారీ జరిమానా తప్పదు. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఈ కొత్త మోటార్ వాహన చట్టాన్ని అమలు చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా కొత్త మోటార్ వాహన చట్టం కింద ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై భారీగా జరిమానాలను పెంచుతూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బైక్ నుంచి 7 సీటర్ కార్ల వరకు ఒక విధమైన జరిమానాను.. ఇతర వాహనాలకు భారీ జరిమానాలు విధించేందుకు సిద్ధమైంది.
ఆ జరిమానాలు ఇలా ఉన్నాయి…
వాహన చెకింగ్ విధులకు ఆటంకం కలిగిస్తే – రూ. 750
సమాచారం ఇవ్వడానికి నిరాకరించినా – రూ. 750
అనుమతి లేని వ్యక్తులకి వాహనం ఇస్తే – రూ. 5000
అర్హత కంటే తక్కువ వయస్సు వారికి వాహనం ఇస్తే – రూ. 5000
డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత లేని వారికి వాహనం ఇస్తే – రూ. 10000
రూల్స్ కి వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే – రూ. 5000
వేగంగా బండి నడిపితే – రూ. 1000
సెల్ ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్ – రూ. 10000
రేసింగ్ మొదటిసారి రూ. 5000, రెండో సారి రూ. 10000
రిజిస్ట్రేషన్ లేకున్నా, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకున్నా – మొదటిసారి రూ. 2000, రెండో సారి రూ. 5000