ఉద్యోగులకు డీఏ పెంపుపై ఏపీ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు..

ఉద్యోగులకు డీఏ పెంపుపై ఏపీ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. జూలై 2018 నుంచి పెంచిన 3.144 శాతం కరువు భత్యాన్ని మంజూరు చేసింది.

ఉద్యోగులకు డీఏ పెంపుపై ఏపీ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు..

Updated on: Nov 05, 2020 | 12:16 AM

Good News To Employees: ఉద్యోగులకు డీఏ పెంపుపై ఏపీ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. జూలై 2018 నుంచి పెంచిన 3.144 శాతం కరువు భత్యాన్ని మంజూరు చేసింది. దీనితో రూ. 27.248 నుంచి రూ. 30.392కు డీఏ పెరిగింది. ఆ డీఏను జనవరి 2021 జీతాలతో కలిపి నగదు రూపంలో చెల్లించాలని నిర్ణయించింది.

2018 జూలై 1 నుంచి 2020 డిసెంబర్ 31 వరకు 30 నెలలు బకాయిలు ఉండగా.. వీటిని జీపీఎఫ్/జడ్పీపీఎఫ్ వారికి 3 సమ భాగాలలో పీఎఫ్ ఖాతాలలో జమ చేయనున్నారు. అలాగే సీపీఎస్ వారికి 30 నెలల ఆరియర్స్ 90% నగదు రూపంలో, 10% ప్రాన్ అకౌంట్‌కు, 3 సమ భాగాలలో(జనవరి జీతాల చెల్లింపు తర్వాత) చెల్లిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Also Read: రోహిత్‌.! టీమిండియా కంటే ఐపీఎల్ ముఖ్యమా.?

Loading...
Unable to load recommendations.
Follow Us