దేవాలయాలను తగులబెట్టాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని ఆ పార్టీ నేత.. జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. చంద్రబాబు హయాంలో మహిళలను ఆర్థికంగా ముంచారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు దళారులు లేకుండా నేరుగా ప్రజలకే అందేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గొప్ప విప్లవం తీసుకొచ్చారని సజ్జల పేర్కొన్నారు. తుని రైలు ఘటనను చంద్రబాబు కావాలని చేయించాడని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సహజవాయువు పై వ్యాట్ టాక్స్ 10 శాతం పెంచిందని.. జీవో ను కనీసం చూడకుండా టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర పరిధిలో అంశాలు, కేంద్ర పరిధిలోని అంశాలు అనే దానిపై వాళ్లకి కనీస అవగాహన లేదన్నారు. దేశంలోనే కోవిడ్ నియంత్రణ కోసం అన్ని రాష్ట్రాల కంటే ఏపీ ప్రభుత్వం ముందుందని సజ్జల తాడేపల్లిలో చెప్పుకొచ్చారు.