Ap Corona Cases : ఏపీలో కరోనా వైరస్ తీవ్రత మళ్లీ కాస్త పెరిగింది. కొత్తగా 50,794 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 326 వైరస్ సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో వైరస్ సోకిన వారి సంఖ్య 8,81,599కి చేరింది. కరోనా మహమ్మారి కారణంగా కొత్తగా మరో ఇద్దరు ప్రాణాలు విడిచారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 7,100కు చేరింది. కొత్తగా మరో 364 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 8,71,116 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,383 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,17,08,678 శాంపిల్స్‌ను టెస్ట్ చేసినట్లు వైద్యారోగ్య శాఖ మంగళవారం రిలీజ్ చేసిన హెల్త్ బులిటెన్‌లో తెలిపింది.
#COVIDUpdates: 29/12/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,78,704 పాజిటివ్ కేసు లకు గాను
*8,68,221 మంది డిశ్చార్జ్ కాగా
*7,100 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 3,383#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/5GRAikZEvA— ArogyaAndhra (@ArogyaAndhra) December 29, 2020
ఇక రాష్ట్రంలో కరోనా వైరస్ స్ట్రెయిన్ తొలి కేసు నమోదైంది. యూకే నుంచి రాజమండ్రి వచ్చిన మహిళకు స్ట్రెయిన్ సోకినట్లు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ అధికారికంగా తెలిపారు. సీసీఎంబీ, ఎన్‌ఐవీ నివేదికల ఆధారంగా స్ట్రెయిన్ అతి తేలినట్లు వివరించారు. సదరు మహిళ 10 రోజుల క్రితం కుమారుడితో సహా యూకే నుంచి రాజమండ్రి వచ్చిందని చెప్పారు. మహిళ నుంచి మరెవరికీ కరోనా సోకలేదని..ఆమె కాంటాక్టు అయిన వ్యక్తులకు పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని వెల్లడించారు.
Also Read :
Wife beats husband : అపరకాళిగా మారిన ఆళి..భర్తను జెండా కర్రకు కట్టేసి కొట్టింది..ఎందుకో తెల్సా..?
Molar Pregnancy : విచిత్రమైన ముత్యాల గర్భం…ప్రెగ్నంట్ అవుతారు..కానీ కడుపులో బిడ్డ ఉండదు