జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లోకి నేరుగా రూ. 15 వేలు..

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమం విషయంలో ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. కరోనా కష్టకాలంలో కూడా వెనక్కి తగ్గకుండా వరుసగా సంక్షేమ పధకాలను అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. తాజాగా ‘వైఎస్ఆర్ నేతన్న పధకం’ ద్వారా పేద నేతన్నలకు ఆర్ధిక సాయం అందించిన జగన్ సర్కార్.. ఇప్పుడు కాపు మహిళలకు అండగా నిలిచేందుకు ‘వైఎస్ఆర్ కాపు నేస్తం’కు శ్రీకారం చుట్టింది. ఈ పధకం ద్వారా కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలకు చెందిన మహిళలకు […]

జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లోకి నేరుగా రూ. 15 వేలు..

Updated on: Jun 23, 2020 | 9:08 AM

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమం విషయంలో ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. కరోనా కష్టకాలంలో కూడా వెనక్కి తగ్గకుండా వరుసగా సంక్షేమ పధకాలను అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. తాజాగా ‘వైఎస్ఆర్ నేతన్న పధకం’ ద్వారా పేద నేతన్నలకు ఆర్ధిక సాయం అందించిన జగన్ సర్కార్.. ఇప్పుడు కాపు మహిళలకు అండగా నిలిచేందుకు ‘వైఎస్ఆర్ కాపు నేస్తం’కు శ్రీకారం చుట్టింది. ఈ పధకం ద్వారా కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలకు చెందిన మహిళలకు ఏటా రూ. 15 వేల చొప్పున ఐదేళ్లకు రూ. 75 వేలు ఆర్ధిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది.

రేపు అనగా 24వ తేదీన సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో ఈ పధకాన్ని ప్రారంభించనున్నారు. 45-60 ఏళ్ల వయసున్న మహిళలకు ఆర్ధికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఈ సాయం చేస్తుండగా.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.36 లక్షల మహిళలకు రూ. 15 వేలు చొప్పున రూ. 353.81 కోట్లు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ కానున్నాయి. 2019–20కి సంబంధించి ఈ పథకాన్ని సీఎం జగన్ రేపు అమలు చేయనున్నారు.

ఎవరు అర్హులంటే…

  • గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలు.. అలాగే పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ12. వేలు ఆదాయం కలిగి ఉన్నవారు అర్హులు
  • కుటుంబానికి 3 ఎకరాల్లోపు మాగాణి/ 10 ఎకరాల్లోపు మెట్ట భూమి లేదా రెండూ కలిపి 10 ఎకరాల్లోపు ఉండాలి.
  • కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను చెల్లిస్తుంటే.. వారు అనర్హులు.
  • 45-60 వయసు ఉన్న వారు అర్హులు..
  • కుటుంబం నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండరాదు( ట్యాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపు)
  • కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా, గవర్నమెంట్ పెన్షన్ తీసుకుంటున్నా అనర్హులు.

Also Read:

టీఎస్ ఎంసెట్ రాసే ఏపీ విద్యార్ధులకు గుడ్ న్యూస్..

వర్మా.. రెస్ట్ ఇన్ పీస్.. నీపై కేసులు వేయనుః అమృత

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆగష్టులో సచివాలయ ఉద్యోగ రాత పరీక్షలకు ఏర్పాట్లు..!

సుశాంత్ సూసైడ్‌లో కొత్త ట్విస్ట్.. ఆ ఇద్దరి మధ్య ‘అఫైర్’..!

జగన్ సర్కార్ సంచలనం.. ఉద్దానం కిడ్నీ బాధితులకు శుభవార్త..

Loading...
Unable to load recommendations.
Follow Us