
కర్ణాటక అసెంబ్లీ డిసెంబర్ 9న( బుధవారం) వివాదాస్పద కర్ణాటక గోవధ నిషేధ, పశువుల సంరక్షణ బిల్లు 2020 ను ఆమోదించింది. ఈ బిల్లును ముఖ్యమంత్రి బిఎస్ యెడియరప్ప నేతృత్వంలోని అధికార బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కర్ణాటకలో పూర్తి గో మాంసం నిషేధం ఉంటుందా అని అడిగినప్పుడు, న్యాయ శాఖ మంత్రి జేపీ మధుస్వామి ఆశ్చర్యకర సమాధానం ఇచ్చారు. “13 ఏళ్ళ వయసుకు పైబడిన ఆవు/గేదె వధకు అనుమతి ఉంటుంది” అని ఆయన అన్నారు.
ఎటువంటి చర్చ లేకుండానే ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య ఆరోపించారు. కేవలం పశుసంవర్ధక శాఖ మంత్రి.. బిల్లును ప్రవేశపెడుతున్నట్లు ఒక ప్రకటన చదివి..ఆమోదింజేశారని..చర్చించేందుకు అవకాశం ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు. బిల్లు కాపీలను సభ్యులకు పంపిణీ చేయలేదని పేర్కొన్నారు. కర్ణాటక ప్రాణుల వధ నిషేధం, ప్రాణుల సంరక్షణా చట్టం 2010కి కేంద్రప్రభుత్వం అనుమతి ఇవ్వని కారణంగా అప్పటినుంచి కర్ణాటకలో సంపూర్ణ గోవధ నిషేధ చట్టం ఆచరణలోకి రాలేదు. ఈనేపథ్యంలో తాజాగా చట్టాన్ని సవరించి కేంద్రం ఆమోదించారు. కేంద్రంలోనూ బీజేపీ ప్రభుత్వమే ఉన్న కారణంగా ఈసారి ఎలాంటి ఆటంకాలు లేకుండా బిల్ పాసయ్యింది.
Also Read :
Bigg Boss Telugu 4 : అభిజీత్ అభిమానుల ఆశలు గల్లంతు, తొలిసారి తెలుగు బిగ్ బాస్ కిరీటం ‘ఆమె’ ఖాతాలో
ఆ కుటుంబం అధికారంలో ఉంటే..వర్షాలు పుష్కలం..వైఎస్సార్, జగన్‌లపై ఎమ్మెల్యే రోజా కీలక వ్యాఖ్యలు