సింగిల్ చార్జ్ పై 120 కి.మీ.. ప్యూర్ ఈవీ నుంచి మరో హై స్పీడ్ ఈ స్కూటర్..
హై స్పీడ్ బైక్‌లను మెచ్చే యువతను లక్ష్యంగా చేసుకొని ఐఐటి హైదరాబాద్ ఇంక్యుబేటడ్ స్టార్టప్.. ప్యూర్ ఈవీ నుంచి సరికొత్త స్కూటర్ ఎట్రాన్స్ నియోను ప్రారంభించనుంది..
హై స్పీడ్ బైక్‌లను మెచ్చే యువతను లక్ష్యంగా చేసుకొని ఐఐటి హైదరాబాద్ ఇంక్యుబేటడ్ స్టార్టప్.. ప్యూర్ ఈవీ నుంచి సరికొత్త స్కూటర్ ఎట్రాన్స్ నియోను ప్రారంభించనుంది.. అధిక వేగం, మంచి పికప్, ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఈ స్కూటర్ ఆకర్షణీయంగా ఉంది.. అత్యాధునిక హంగులతో దీనిని తీర్చి దిద్దామని ప్యూర్ ఈవీ కో పౌండర్ రోహిత్ వదేరా అన్నారు. కాగా ఇది ప్యూర్ ఈవీ నుంచి వచ్చిన రెండో హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. మొదటిది ప్లూటో 7 జీ పేరుతో బాగా పాపులర్ అయింది..అయితే ఎట్రాన్స్ నియో డిసెంబర్ నెల 1 వ తేదీ నుంచి మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. దీని ధరను రూ.75,999 గా నిర్ణయించారు.
అయితే మొదటి ఏడాదిలోనే 10,000 యూనిట్లను విక్రయించాలని కంపెనీ లక్యంగా పెట్టుకుంది. కొత్త మోడల్ మొదటగా హైదరాబాద్ నగరంలో అందుబాటులో ఉంటుంది.. రెండో వారం నుంచి దేశ వ్యాప్తంగా తమ బ్రాంచ్‌లలో విక్రయిస్తామని కంపెనీ పేర్కొంది. ఎట్రాన్స్ నియో 5 సెకన్లలలో 0 నుంచి 40 కిలో మీటర్ల వేగాన్ని అందిస్తుంది. సింగిల్ చార్జ్‌పై 120 కిలో మీటర్ల వరకు ప్రయాణించగలదు. గంటకు 60 కిలో మీటర్ల వేగంతో పరుగెడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనడానికి లైసెన్స్, రిజస్ట్రేషన్, బీమా తప్పనిసరిగా అవసరం.