కిడ్నీ రోగులకు అండగా ఏపీ ప్రభుత్వం.. రూ.50 కోట్లతో ఆస్పత్రికి గ్రీన్ సిగ్నల్

| Edited By:

Sep 04, 2019 | 12:06 AM

ఆంధ్రప్రదేశ్‌లో కిడ్నీబాధితుల సమస్యను ఎదుర్కొంటున్న ప్రాంతం శ్రీకాకుళం జిల్లా ఉద్దానం. ఈ సమస్యపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయ తీసుకుంది. కిడ్నీ బాధితుల కోసం పలాసలో 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. ఆస్పత్రికి అనుసంధానంగా రీసెర్చ్‌ సెంటర్‌, డయాలసిస్‌ యూనిట్‌ ఏర్పాటుకు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆస్పత్రితో పాటు కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌, డయాలసిస్‌ యూనిట్‌కు రూ.50కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో జారీ చేసింది. కిడ్నీ బాధితుల […]

కిడ్నీ రోగులకు అండగా ఏపీ ప్రభుత్వం.. రూ.50 కోట్లతో  ఆస్పత్రికి గ్రీన్ సిగ్నల్
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో కిడ్నీబాధితుల సమస్యను ఎదుర్కొంటున్న ప్రాంతం శ్రీకాకుళం జిల్లా ఉద్దానం. ఈ సమస్యపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయ తీసుకుంది. కిడ్నీ బాధితుల కోసం పలాసలో 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. ఆస్పత్రికి అనుసంధానంగా రీసెర్చ్‌ సెంటర్‌, డయాలసిస్‌ యూనిట్‌ ఏర్పాటుకు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆస్పత్రితో పాటు కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌, డయాలసిస్‌ యూనిట్‌కు రూ.50కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో జారీ చేసింది.

కిడ్నీ బాధితుల సమస్యలు కళ్లారా చూసిన సీఎం జగన్:

ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలకు ముందు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన సమయంలో ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యల్ని కళ్లారా చూశారు. అప్పుడే తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే భాధితులకు నెలకు రూ.10వేలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత అధికారాన్నిచేపట్టిన తొలిరోజు నుంచే ఆ హామీని అమలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,500 మందికి నెలకు రూ.10 వేల చొప్పున రూ.8.50 కోట్లను చెల్లిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హాయాంలో కూడా రాష్ట్రంలో ఉన్న 4 వేలమంది కిడ్నీ రోగులకు నెలకు రూ.2500 ఫించన్ అందించారు. కానీ జగన్ సీఎం అయ్యాక దాన్ని పదివేలు చేయడంపై ఉద్దానం కిడ్నీ బాధితుల కుటుంబాల్లో సంతోషం వెల్లివిరిసింది.
తాజాగా ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి రూ.50 కోట్ల ఖర్చుతో కిడ్నీ రోగుల కోసం ప్రత్యేక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, కిడ్నీ రీసెర్జ్ సెంటర్, డయాలసిస్ యూనిట్ నిర్మించేందుకు నిర్ణయించింది. దీంతో కిడ్నీ రోగులు, వారి బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అత్యధికంగా శ్రీకాకుళంలోనే :

రాష్ట్రంలో ఉన్న కిడ్ని రోగులందరికంటే శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలోనే అత్యధికంగా దాదాపు 112 గ్రామాల్లో అధికంగా కిడ్నీ బాధితులు డయాలసిస్ చేయించుకుంటున్నారు. అదే విధంగా కృష్ణా జిల్లా జి.కొండూరు, ప్రకాశం జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లో డయాలసిస్‌ బాధితులు ఉన్నారు.