బాలకృష్ణ, లోకేష్, పవన్ కళ్యాణ్ పై మంత్రి కన్నబాబు హాట్ కామెంట్స్, రికార్డింగ్ డ్యాన్సులు వేయలేదని సెటైర్లు

|

Dec 31, 2020 | 7:58 PM

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌పై మండిపడ్డారు ఏపీ మంత్రి కన్నబాబు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏనాడూ..

బాలకృష్ణ, లోకేష్, పవన్ కళ్యాణ్ పై మంత్రి కన్నబాబు హాట్ కామెంట్స్, రికార్డింగ్ డ్యాన్సులు వేయలేదని సెటైర్లు
Kannababu
Follow us on

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌పై మండిపడ్డారు ఏపీ మంత్రి కన్నబాబు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏనాడూ పరామర్శించనివారు తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం ఏంటన్నారు. గతంలో చంద్రబాబు ఇన్‌పుట్ సబ్సిడీ ఎగ్గొడితే పవన్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతు సమస్యలు గుర్తుకురాలేదా అని కన్నబాబు నిలదీశారు. నష్టపోయిన ప్రతి రైతునూ ఆడుకుంటామని, గత ప్రభుత్వం కంటే ఎక్కువే సహాయం చేశామన్నారు. నియోజకవర్గంలో సుబ్రమణ్యం స్వామిని దర్శించుకున్నప్పుడు – స్టేజ్ దగ్గర భక్తి పాటలు వస్తే ..తాను లేచి వచ్చానని చెప్పారు కన్నబాబు. ‘లోకేష్‌లా అమ్మాయిలతో చిందులు వేయలేదు…వాళ్ల మామలాగా రికార్డింగ్‌ డ్యాన్సులు వేయలేదు’ అన్నారు. పవన్ కల్యాణ్ జగన్‌ సర్కార్‌కు డెడ్ లైన్ పెట్టడం ఏంటని మంత్రి విమర్శించారు.