ఇంధన పొదుపులో ఏపీ టాప్.. కేంద్రం ప్రశంసలు..

| Edited By:

Jul 27, 2020 | 12:51 PM

పెర్ఫార్మ్ అచీవ్ & ట్రేడ్ (పాట్) పథకం కింద ఆంధ్రప్రదేశ్ ఇంధన విభాగం పరిశ్రమల రంగంలో 2,386 మిలియన్ యూనిట్ల (ఎంయు) విద్యుత్తును ఆదా చేసింది. ‌కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ)

ఇంధన పొదుపులో ఏపీ టాప్.. కేంద్రం ప్రశంసలు..
Follow us on

పెర్ఫార్మ్ అచీవ్ & ట్రేడ్ (పాట్) పథకం కింద ఆంధ్రప్రదేశ్ ఇంధన విభాగం పరిశ్రమల రంగంలో 2,386 మిలియన్ యూనిట్ల (ఎంయు) విద్యుత్తును ఆదా చేసింది. ‌కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసించింది. రాష్ట్ర ఇంధన శాఖ ఈ విషయాన్ని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. పారిశ్రామిక రంగంలో కేంద్రం అమలు చేస్తోన్న ‘పెర్ఫార్మ్, అచీవ్‌ అండ్‌ ట్రేడ్‌’ (పాట్‌) పథకంలో ఏపీ అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు తెలిపింది.

రాష్ట్రవ్యాప్తంగా పలు పరిశ్రమల్లో రూ.1,600 కోట్ల విలువైన 2,386 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును ఏపీ పొదుపు చేసిందని వివరించింది. విద్యుత్‌ వినియోగం అధికంగా ఉండే సిమెంట్, ఫెర్టిలైజర్స్, పవర్‌ జనరేషన్, పేపర్‌ అండ్‌ పల్ప్, రసాయన రంగాలకు చెందిన 22 పరిశ్రమల్లో ‘పాట్‌’ పకడ్బందీగా అమలు చేసినట్లు ఇంధన శాఖ వెల్లడించింది.

Read More: 

గుడ్ న్యూస్: సప్లిమెంటరీ, బ్యాక్‌లాగ్‌ విద్యార్థులకు పాస్‌ మార్కులు..

గుడ్ న్యూస్: ఇక కామర్స్‌, ఆర్ట్స్‌ విద్యార్థులకూ ‘గేట్‌’ రాసే అవకాశం..!