మాజీ మంత్రి మోకా శ్రీవిష్ణుప్రసాదరావు కన్నుమూత.. అనారోగ్యంతో అమలాపురంలో మృతి

| Edited By: Pardhasaradhi Peri

Dec 27, 2020 | 5:24 PM

ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి మోకా శ్రీవిష్ణుప్రసాదరావు (90) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన.. నాలుగు రోజుల క్రితం అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తీవ్ర అస్వస్థత గురై మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

మాజీ మంత్రి మోకా శ్రీవిష్ణుప్రసాదరావు కన్నుమూత.. అనారోగ్యంతో అమలాపురంలో మృతి
Follow us on

ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి మోకా శ్రీవిష్ణుప్రసాదరావు (90) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన.. నాలుగు రోజుల క్రితం అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తీవ్ర అస్వస్థత గురై మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్రీవిష్ణు ప్రసాదరావు గ్రామసర్పంచిగా ప్రస్థానం ప్రారంభించి రాష్ట్ర మంత్రిగా ఎదిగారు. తూ.గో జిల్లాలోని కాట్రేనికోనకు చెందిన శ్రీవిష్ణు ప్రసాదరావు కాట్రేనికోన గ్రామపంచాయతీకి 18 సంవత్సరాలపాటు సర్పంచ్‌గా సేవలందించారు. అనంతరం 1972లో మొదటిసారిగా అల్లవరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1977లో ఇందిరా కాంగ్రెస్‌ తరపున రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978లో మర్రిచెన్నారెడ్డి మంత్రివర్గంలో మార్కెటింగ్‌శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రజాప్రతినిధులు, అభిమానులు, కాంగ్రెస్ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.