Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న’పెళ్లి కానుక’ డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది. దాదాపు 22 నెలలుగా పెండింగ్‌లో ఉన్న రూ. 270 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అప్లై చేసుకున్న చాలామంది పేద నూతన దంపతుల అకౌంట్లలో డబ్బులు జమ కానున్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 5,861 జంటలు లబ్ధి పొందనున్నాయి. కాగా కన్‌స్ట్రక్షన్ వర్కర్స్‌కు ఇచ్చే ‘పెళ్లి కానుకను’ వైసీపీ సర్కార్ 5 రెట్లు పెంచి..రూ. 20 వేల నుంచి రూ. లక్షగా మార్చారు. గత టీడీపీ హయాంలో ‘చంద్రన్న కానుక’ పేరుతో..ఇలా పేద, వెనకబడిన వర్గాల వారు పెళ్లి చేసుకునేటప్పుడు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసేది. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఇచ్చే సాయాన్ని భారీగా పెంచి..పథకానికి వైఎస్సార్ పెళ్లి కానుకగా నామకరణం చేశారు. పెంచిన నగదును శ్రీరామనవమి నుంచి పంపిణీ చేయనున్నారు.