Radio signal from space: 16 రోజులుగా రేడియో సిగ్నల్స్.. ఏలియన్స్ పనేనా..?

Radio signal from space: శాస్త్రవేత్తల బృందం అంతరిక్షం నుంచి కొద్ది రోజులుగా తమకు రేడియో సిగ్నల్స్ అందుతున్నట్లు వెల్లడించారు. మొదటిసారిగా, ఈ రేడియో సిగ్నల్స్ ఒకే విధంగా, స్పష్టమైన వ్యవధిలో పునరావృతమవుతున్నాయి. ఈ సిగ్నళ్లు గతంలో ఎప్పుడూ లేనంత కొత్తగా ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీతో భూమిని చేరుతుండటం ఆశ్చర్యకరం. వచ్చి పోతుండటమే కాకుండా నిర్ణీత సమయానికి రిపీట్ అవుతూ.. ఒకే ఇంటర్వెల్‌ను మెయింటైన్ చేస్తున్నాయి. వీటిని ఫాస్ట్ రేడియో బరస్ట్స్ (FRB లు) గా సూచిస్తారు. 2018 […]

Radio signal from space: 16 రోజులుగా రేడియో సిగ్నల్స్.. ఏలియన్స్ పనేనా..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 15, 2020 | 3:44 PM

Radio signal from space: శాస్త్రవేత్తల బృందం అంతరిక్షం నుంచి కొద్ది రోజులుగా తమకు రేడియో సిగ్నల్స్ అందుతున్నట్లు వెల్లడించారు. మొదటిసారిగా, ఈ రేడియో సిగ్నల్స్ ఒకే విధంగా, స్పష్టమైన వ్యవధిలో పునరావృతమవుతున్నాయి. ఈ సిగ్నళ్లు గతంలో ఎప్పుడూ లేనంత కొత్తగా ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీతో భూమిని చేరుతుండటం ఆశ్చర్యకరం. వచ్చి పోతుండటమే కాకుండా నిర్ణీత సమయానికి రిపీట్ అవుతూ.. ఒకే ఇంటర్వెల్‌ను మెయింటైన్ చేస్తున్నాయి.

వీటిని ఫాస్ట్ రేడియో బరస్ట్స్ (FRB లు) గా సూచిస్తారు. 2018 సెప్టెంబరు 16 నుంచి 2019 అక్టోబరు 30వరకూ ఈ సిగ్నల్స్ అందాయని సైంటిస్టులు చెబుతున్నారు. వీటిని నిర్థారించుకునే క్రమంలో కెనడియన్ హైడ్రోజన్ ఇంటన్సిటీ మ్యాపింగ్ ఎక్సపెరిమెంట్, ఎఫ్పార్బీ ప్రాజెక్టులను చిమె టెలిస్కోపు సహాయంతో పూర్తి చేశారు.

అంతరిక్షంలో ఉద్భవించే రేడియో సిగ్నల్స్ మిల్లీసెకన్ల నిడివి మాత్రమే ఉంటాయి. ఇవి గంటకోసారి లేదా నాలుగు రోజుల్లో 2సార్లు వచ్చి 12రోజులు ఆగిపోతున్నాయి. మళ్లీ వరుసగా 16.35రోజులు వస్తున్నాయి. ఇలా సంవత్సరం నుంచి వస్తుండటం గమనార్హం. సైంటిస్టులు ఏదైనా పెద్ద స్టార్, లేదా నక్షత్ర సముదాయం కదులుతూ భూమి వైపుకు వస్తుందనని అంచనా వేస్తున్నారు. సిగ్నల్స్ ఊహాతీతంగా కొత్తగా ఉండటంతో ఏలియన్స్ భూమికి దగ్గరగా వస్తున్నాయా అనే అనుమానాలు లేకపోలేదు. గ్రహాంతరవాసులు ప్రయాణించేటప్పుడు స్పెషల్ ఫ్రీక్వెన్సీతో సిగ్నల్స్ వస్తాయనే సంగతి తెలిసిందే.