ఆంధ్ర, రాయలసీమ.. ఇలా సెంటర్ ఏదైనా, స్పాట్ పెట్టేది మాత్రం హైదరాబాదే. ఫ్యాక్షన్@భాగ్యనగరం అన్నట్టుంది పరిస్థితి. కక్షలు, కార్పణ్యాలు, ఆధిపత్యాలు ఎక్కడ పుట్టినాకాని, కిడ్నాప్‌లు, హత్యలు, ల్యాండ్ సెటిల్ మెంట్లు ఇలా, వ్యవహారాలన్నిటికీ ఇక్కడే ఫుల్ స్టాప్ పడుతోంది. తాజాగా హకీ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్ రావు కిడ్నాప్ తో హైదరాబాద్ మళ్లీ సెంటరాఫ్ అట్రాక్షన్ అయింది. ఈ నేపధ్యంలో గతంలో హైదరాబాద్ లో జరిగిన కొన్ని ముఖ్య ఘటనలు పరిశీలిద్దా్ం.
నవంబర్20, 1997 : హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో టీడీపీ నేత పరిటాల రవి లక్ష్యంగా బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 23 మంది మృతి చెందగా, 31 మందికి గాయాలయ్యాయి. ఈ ఉదంతానికి రాయలసీమ ఫ్యాక్షన్ కక్షల నేపథ్యమే కారణం.
నవంబర్ 11, 2005 : పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతోన్న పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మొద్దు శీను, చందానగర్ సుప్రజా లాడ్జిలో బాంబు తయారు చేస్తూ, ప్రమాదవశాత్తూ బాంబు పేలడంతో గాయపడి పోలీసులకు చిక్కాడు.
మార్చి11, 2009 : పరిటాల రవి హత్యకేసులో కీలక సూత్రధారి అని భావించిన సీమ నేత భాను కిరణ్ సికింద్రాబాద్‌లో పోలీసులకు చిక్కాడు. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో ఎం.భానుకిరణ్ ను పోలీసులు అరెస్టు చేశారు.
సెప్టెంబర్ 27, 2010: యూసుఫ్ గూడ మధురానగర్లో టీడీపీ నేత చలసాని వెంకటేశ్వర రావు అలియాస్ పండు హత్య. చలసాని పండు కృష్ణాజిల్లా పెనమలూరు నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓటమి చవిచూసిన పండు హత్యలో భూసెటిల్మెంట్ వ్యవహారమే కారణమని ఆరోపణలు. వంగవీటి రంగా హత్య కేసులో పండు నిందితుడుగా ఉన్నాడు.
జనవరి 4, 2011 : మద్దెలచెరువు సూరిని కాల్చి చంపిన భాను కిరణ్. యూసఫ్ గూడలో గంగుల సూర్యారాయణరెడ్డి అలియాస్ మద్దెల చెరువు సూరిపై కారులో కలిసి ప్రయాణిస్తుండగానే సూరిపై అనుచరుడు భాను కిరణ్ కాల్పులు జరిపి చంపేశాడు.
జనవరి30, 2019 : ప్రముఖ పారిశ్రామిక వేత్త, టీవీ ఛానల్ ఎండీ చిగురుపాటి జయరామ్ హత్య. హైదరాబాద్ లో హతమార్చి కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం తీసుకెళ్లిన నిందితులు
కారులోనే డెడ్ బాడీ వదలి వెళ్లిన నిందితులు
జులై 7, 2019 : విజయవాడ స్టీల్ ఫ్యాక్టరీ వ్యాపారి తేలప్రోలు రాం ప్రసాద్ హత్య. పంజాగుట్ట దగ్గర రాంప్రసాద్ ను దుండగులు హతమార్చారు. ఈ హత్యకు సంబంధించి విజయవాడ వైసీపీ నేత కోగంటి సత్యం పై అనుమానాలు ఉన్నాయి.
మార్చి12, 2020 : జూబ్లీహిల్స్ లో ఏవీ సుబ్బారెడ్డిని హతమార్చేందుకు ప్లాన్. హైదరాబాద్ లో రెక్కీ నిర్వహించిన నిందితుడు పకీర్. పోలీస్ పెట్రోలింగ్ వాహనంతో రావటంతో వెనక్కి తగ్గిన పకీర్. రవిచంద్రారెడ్డి, రామిరెడ్డిలతో కలిసి హత్యకు ప్లాన్ చేసినట్టు అభియోగాలు, కుట్ర భగ్నం చేసిన కడప జిల్లా పోలీసులు. భూమా అఖిల ప్రియపై ఆరోపణలు.
అక్టోబర్ 8, 2020 : మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి కొడుకు కొండారెడ్డి హైదరాబాద్ లో వీరంగం. డిస్ట్రిబ్యూటర్‌ను కిడ్నాప్ చేసిన కొండారెడ్డి గ్యాంగ్. హైదరాబాద్‌లో బంజారాహిల్స్ లో సినీ ఫక్కీ లో శివగణేష్ అనే డిస్ట్రిబ్యూటర్ కిడ్నాప్. తుపాకులు, కత్తులు చూపించి బెదిరింపులు. శామీర్ పేట , కడప జిల్లాకు చెందిన భూముల విషయం పై వివాదం.
జనవరి 6, 2021 : హాకీ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్ రావు, నవీన్ రావు, సునీల్ రావులను కిడ్నాప్ చేసిన రాయలసీమకు చెందిన గ్యాంగ్. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్ పై ఆరోపణలు. బోయిన్‌పల్లిలో రూ.500 కోట్ల విలువ చేసే భూ వివాదం కారణమనే చర్చ.