Anchor Pradeep: ప్రదీప్ కోసం దిగొచ్చిన బుల్లి తెర టాప్ యాంకర్లు… ప్రమోషనల్ సాంగ్‌లో చిందులేసిన ముద్దుగుమ్మలు..

|

Jan 27, 2021 | 6:42 PM

Lady Anchors Dance For Pradeep Movie Promotion: యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి నటుడిగా ఎదిగాడు ప్రదీప్ మాచిరాజు. ‘కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా’తో పాటు ఎన్నో పాపులర్ షోల ద్వారా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడీ యంగ్ యాంకర్. ఇక ఓవైపు యాంకర్‌గా రాణిస్తూనే మరోవైపు..

Anchor Pradeep: ప్రదీప్ కోసం దిగొచ్చిన బుల్లి తెర టాప్ యాంకర్లు... ప్రమోషనల్ సాంగ్‌లో చిందులేసిన ముద్దుగుమ్మలు..
Follow us on

Lady Anchors Dance For Pradeep Movie Promotion: యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి నటుడిగా ఎదిగాడు ప్రదీప్ మాచిరాజు. ‘కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా’తో పాటు ఎన్నో పాపులర్ షోల ద్వారా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడీ యంగ్ యాంకర్. ఇక ఓవైపు యాంకర్‌గా రాణిస్తూనే మరోవైపు సినిమాల్లోనూ నటించాడు ప్రదీప్.
‘వరుడు’, ‘జులాయి’, ‘అత్తారింటికి దారేది’లాంటి చిత్రాల్లో సైడ్ యాక్టర్‌గా కనిపించిన ప్రదీప్ ఇప్పుడు ఏకంగా హీరోగా మారాడు. ప్రదీప్ హీరోగా నటిస్తోన్న ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘నీలి నీలి ఆకాశం’ పాట ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉంటే ఈ సినిమాను ఈ నెల 29న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రదీప్ ఓ కొత్త పాటను విడుదల చేశాడు. ‘వావా మేరే బావా’ అనే ప్రమోషన్ సాంగ్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియోలో టాలీవుడ్‌కు చెందిన ముగ్గురు సెన్సేషన్ యాంకర్లు రష్మీ, అనసూయ, శ్రీముఖి స్టెప్పులేయడం విశేషం. ఎంతో జోవియల్‌గా ఉండే ప్రదీప్.. ఈ ముగ్గురు యాంకర్లతో కలిసి పలు సందర్భాల్లో షోలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు డ్యాన్స్ ఫ్లోర్‌ను షేక్ చేశారు. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: OTT: భారీగా పెరుగుతోన్న ఓటీటీ వ్యాపారం.. ప్రాంతీయ భాషా కార్యక్రమాల వీక్షకులే అధికం.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన..