ఆరుసార్లు ఓటమి.. ఏడో గేమ్‌లో విజయం..

|

Jul 28, 2020 | 5:52 AM

చెస్ దిగ్గజం, మాజీ ప్రపంచ ఛాంపియన్, భారత నెంబర్ వన్ విశ్వనాథన్ ఆనంద్ బోణీ కొట్టారు. ఆరు సార్లు ఓటమి చూసినా.. కుంగిపోకుండా ఏడో గేమ్‌లో విజయాన్ని...

ఆరుసార్లు ఓటమి.. ఏడో గేమ్‌లో విజయం..
Follow us on

Anand Finds The Winning Gear : చెస్ దిగ్గజం, మాజీ ప్రపంచ ఛాంపియన్, భారత నెంబర్ వన్ విశ్వనాథన్ ఆనంద్ బోణీ కొట్టారు. ఆరు సార్లు ఓటమి చూసినా.. కుంగిపోకుండా ఏడో గేమ్‌లో విజయాన్ని దక్కించుకున్నాడు. లెజెండ్స్‌ ఆఫ్‌ చెస్‌ ఆన్‌లైన్‌ టోర్నీలో ఎట్టకేలకు విజయాన్ని నమోదు చేశారు. ఇప్పటివరకు తొలి ఆరు రౌండ్లలో వరుస ఓటమిని చవిచూసిన ఆనంద్ ఎట్టకేలకు విజయం సాధించారు.

స్విద్లెర్, కార్ల్‌సన్, క్రామ్నిక్, అనీశ్‌ గిరి, పీటర్‌ లెకో, నెపోమ్‌నియాచి చేతిలో ఓటమి పాలైన ఆనంద్‌ ఏడో రౌండ్‌ గేమ్‌లో ఇజ్రాయెల్‌ గ్రాండ్‌మాస్టర్‌ గెల్‌ఫాండ్‌ బోరిస్‌పై విజయం సాధించాడు. సోమవారం జరిగిన ఈ గేమ్‌లో విశ్వనాథన్ ఆనంద్‌ 2.5–0.5తో బోరిస్‌పై విజయం సాధించాడు.