వెబ్ సిరీస్‌గా ‘అమృతం’.. మునపటి ఫీల్ ఉండేనా.?

|

Jan 10, 2020 | 3:45 PM

‘అమృతం’.. ఇదొక బ్రాండ్. 2000వ సంవత్సరంలో ఈ సీరియల్ ఒక సంచలనం. మాములు కామెడీ సీరియల్‌గా స్టార్ట్ అయిన దీని ప్రయాణం.. ఏ స్థాయిలో దూసుకుపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీఆర్పీ రేటింగ్స్‌లో కూడా ప్రభంజనం సృష్టించింది. ఇప్పటికీ కూడా అభిమానులు ఈ సీరియల్ ఎపిసోడ్స్ కోసం యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తున్నారంటే ‘అమృతం’ రేంజు అలాంటిది మరి. ప్రస్తుతం జీ5 ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ద్వారా ప్రేక్షకులకు ఆనందాన్ని పంచుతున్న ఈ సీరియల్‌ను త్వరలోనే వెబ్ సిరీస్‌గా తీయాలని […]

వెబ్ సిరీస్‌గా అమృతం.. మునపటి ఫీల్ ఉండేనా.?
Follow us on

‘అమృతం’.. ఇదొక బ్రాండ్. 2000వ సంవత్సరంలో ఈ సీరియల్ ఒక సంచలనం. మాములు కామెడీ సీరియల్‌గా స్టార్ట్ అయిన దీని ప్రయాణం.. ఏ స్థాయిలో దూసుకుపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీఆర్పీ రేటింగ్స్‌లో కూడా ప్రభంజనం సృష్టించింది. ఇప్పటికీ కూడా అభిమానులు ఈ సీరియల్ ఎపిసోడ్స్ కోసం యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తున్నారంటే ‘అమృతం’ రేంజు అలాంటిది మరి. ప్రస్తుతం జీ5 ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ద్వారా ప్రేక్షకులకు ఆనందాన్ని పంచుతున్న ఈ సీరియల్‌ను త్వరలోనే వెబ్ సిరీస్‌గా తీయాలని కొంతమంది నిర్మాతలు ఆలోచిస్తున్నారట. ఒకవేళ అది సక్సెస్ అయితే ఛానల్‌లో కూడా ప్రసారం చేయాలన్నది వారి ఆలోచన.

‘అమృతం’ సృష్టికర్త గుణ్ణం గంగరాజు దర్శకత్వంలోనే ఈ వెబ్ సిరీస్ కూడా తెరకెక్కనుందని సమాచారం. గతంలో మాదిరిగానే అంజి, అప్పాజీ, అమృతం, సర్వం పాత్రలను బేస్ చేసుకుని విభిన్న కథలతో ఈ సిరీస్‌ను రూపొందించనున్నారట. కానీ అప్పట్లో ఈ పాత్రల్లో నటీనటులు జీవించి నటించారు. అందుకే ఇప్పటికీ ఈ సీరియల్‌కు అంతటి రెస్పాన్స్ లభిస్తోంది. అయితే ఇప్పుడు వెబ్ సిరీస్ అంటే మళ్ళీ గతంలో మాదిరిగా ఫీల్ ఉంటుందా అనేది ప్రశ్న. ఒకవేళ తీసినా కూడా ఇప్పటి పరిస్థితుల బట్టి ఏదొక మార్పు చెయ్యక తప్పదు. దానితో మొత్తం కాన్సెప్ట్ దెబ్బ తిన్నా ఆశ్చర్యపోనక్కర్లేదన్నది అభిమానుల మాట.