ఇంటర్ విద్యార్ధులకు కూడా అమ్మ ఒడి.. సీఎం జగన్ కీలక నిర్ణయం

ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అమ్మఒడి పథకాన్ని ఇంటర్మీడియట్ విద్యార్ధులకు అందించాలని నిర్ణయించారు. ఈ పథకం కేవలం ప్రభుత్వ పాఠశాలలకేనా..లేక ప్రైవేటుకు కూడా వర్తిపంజేస్తారా అనే విషయంలో మొన్నటివరకు తర్జనభర్జన పడ్డారు. అయితే ఈ పథకాన్ని ప్రైవేటు స్కూళ్లకు కూడా వర్తిపంజేయనున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టతఇచ్చింది. తాజా నిర్ణయంతో ఇంటర్ చదివే విద్యార్ధులకు అమ్మఒడి సాయం అందనుంది. హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లలో చదివే విద్యార్థులకూ ఇవ్వాలని సీఎం జగన్ […]

ఇంటర్ విద్యార్ధులకు కూడా అమ్మ ఒడి.. సీఎం జగన్ కీలక నిర్ణయం

Edited By:

Updated on: Jun 27, 2019 | 2:55 PM

ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అమ్మఒడి పథకాన్ని ఇంటర్మీడియట్ విద్యార్ధులకు అందించాలని నిర్ణయించారు.

ఈ పథకం కేవలం ప్రభుత్వ పాఠశాలలకేనా..లేక ప్రైవేటుకు కూడా వర్తిపంజేస్తారా అనే విషయంలో మొన్నటివరకు తర్జనభర్జన పడ్డారు. అయితే ఈ పథకాన్ని ప్రైవేటు స్కూళ్లకు కూడా వర్తిపంజేయనున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టతఇచ్చింది. తాజా నిర్ణయంతో ఇంటర్ చదివే విద్యార్ధులకు అమ్మఒడి సాయం అందనుంది.

హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లలో చదివే విద్యార్థులకూ ఇవ్వాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు. గతంలో వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అమ్మఒడి పథకం కింద తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చదివించే ప్రతీ తల్లికి రిపబ్లిక్ దినోత్సవం జోరున 15 వేల రూపాయల సాయం అందించనున్నారు.