
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్.. ఆయన కుటుంబసభ్యుల్లో కొందరికి ఇటీవల కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అమితాబ్‌కు కరోనా సోకిందని తెలియగానే ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ఆందోళనకు గురయ్యారు. అమితాబ్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. అభిమానులైతే ఆయన కరోనా నుంచి కోలుకోవాలని పూజలు… యాగాలు, హోమాలు, దీపాలు వెలిగించి ప్రార్థనలు చేస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బిగ్ స్పందించారు తన సెల్ ద్వారా మెసెజ్ ను పోస్ట్ చేశారు. తనపై ప్రేమ చూపిస్తున్న శ్రేయోభిలాషులకు, అభిమానులకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ధన్యవాదాలు తెలిపారు.
‘‘మేము బాగుండాలని మీరంతా కోరుకున్నారు. సోషల్ మీడియా ద్వారా మీ ఆశీస్సులు, ప్రేమ, ప్రార్థనలు అందించారు. మీ అందరికి నేను చెప్పే కృతజ్ఞతలకు హద్దులు లేవు. ఆస్పత్రిలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. అందుకే నా ఆరోగ్యంపై మరిన్ని వివరాలు చెప్పలేకపోతున్నా.. ప్రేమతో నమస్కారం’’ అని అమితాబ్ ట్వీట్ చేశారు.
అంతకుముందు ట్వీట్‌లో ‘‘త్వమేవ మాతా చ పితా త్వమేవ. త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ. త్వమేవ విద్య ద్రవిణం త్వమేవ. త్వమేవ సర్వం మమ దేవ దేవ’’అని ప్రార్థిస్తూ శివుడి ఫొటో పోస్టు చేశారు.
సోషల్‌మీడియాలో అమితాబ్ బచ్చన్ చాలా యాక్టివ్ ఉంటారు. వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. గత శనివారం రాత్రి కరోనా సోకిందని తెలిసిన వెంటనే ఆ విషయాన్ని అమితాబ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. అప్పటి నుంచి ఆయనకు పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి.