ఇన్ స్టా గ్రామ్ లో అమెరికన్ మైనర్ ను వేధిస్తున్న నిజామాబాద్ కు చెందిన ఇంజనీరింగ్ యువకుడు కటకటాలపాలయ్యాడు. ఫ్రెండ్ రిక్వెస్ట్స్ పంపి యువతులతో ప్రొఫెషనల్ చాటింగ్ చేస్తున్న ఈ బిటెక్ బాబుని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అమ్మాయిలను మాటలో దింపి వాళ్ల అభ్యంతకర ఫోటోలు తీసుకున్న నిజామాబాద్ కి చెందిన సందీప్.. ఆపై న్యూడ్ ఫోటో లు పంపాలని బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. తాను అడిగినంత అమౌంట్ ఇవ్వకుంటే న్యూడ్ ఫోటో లను సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తా అంటూ సదరు అమెరికన్ మైనర్ బాలికను సందీప్ బెదిరించాడని సమాచారం. వేధింపులు తట్టుకోలేక సదరు యువతి ఇంస్టాగ్రామ్ లో బ్లాక్ చేయడంతో ఆ అమ్మాయి ఫోటోలని ఫ్రెండ్స్ కు పంపాడు సందీప్. దీంతో భయపడి బాధిత బాలిక తల్లిదండ్రులకు విషయం తెలపడంతో బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి సందీప్ ను అరెస్ట్ చేశారు.