అమెరికా చర్యకు చైనా ప్రతీకారం… జాతీయ పతాకం అవనతం

| Edited By: Pardhasaradhi Peri

Jul 27, 2020 | 10:49 AM

అమెరికా-చైనా దేశాల మధ్య దౌత్య సంబంధాలు నానాటికీ దిగజారుతున్నాయి. హూస్టన్ లోని చైనా దౌత్యకార్యాలయాన్ని 72 గంటల్లోగా మూసివేయాలని మూడు రోజుల క్రితం అమెరికా హెచ్ఛరించిన సంగతి..

అమెరికా చర్యకు చైనా ప్రతీకారం... జాతీయ పతాకం అవనతం
Follow us on

అమెరికా-చైనా దేశాల మధ్య దౌత్య సంబంధాలు నానాటికీ దిగజారుతున్నాయి. హూస్టన్ లోని చైనా దౌత్యకార్యాలయాన్ని 72 గంటల్లోగా మూసివేయాలని మూడు రోజుల క్రితం అమెరికా హెచ్ఛరించిన సంగతి విదితమే.  ఆ రోజున ఆ కార్యాలయంలోని చైనా డాక్యుమెంట్లను, సామాగ్రిని అమెరికన్ సిబ్బంది తగులబెట్టి కంటెయినర్లలో పడేశారు. దీంతో ఆగ్రహించిన చైనా.. తమ చెంగ్ డూ నగరంలోని అమెరికన్ కాన్సులేట్ పై గల ఆ దేశ జాతీయ పతాకాన్ని కిందకు దించివేసింది. అయితే అమెరికన్ దౌత్య సిబ్బంది నిష్క్రమణకు ఎలాంటి డెడ్ లైన్ విధించలేదు. చెంగ్ డూ లోని అమెరికన్ దౌత్య కార్యాలయానికి దారి తీసే రోడ్డును సోమవారం ఉదయం పోలీసులు మూసివేశారు. ఇందులోని స్టాఫ్ ఉదయం ఆరుగంటలకే వెళ్లిపోయారు. ఈ నెల 25 న కొందరు చైనా కార్మికులు ఈ ఆఫీసు ప్రాంగణం లోని అమెరికన్ స్మృతి చిహ్నాలను తొలగించారు. ఇక్కడి అమెరికన్ దౌత్య సిబ్బంది చైనా అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటున్నారని, వారు తమ దేశ భద్రతకు ముప్పుగా పరిణమించారని చైనా విదేశాంగ శాఖ ఆరోపించింది.