అమేజాన్‌ సమ్మర్ సేల్… 80 శాతం తగ్గింపు!

| Edited By:

May 01, 2019 | 8:51 PM

అమేజాన్ సమ్మర్ సేల్ మళ్లీ వచ్చేసింది. ఈ సేల్ మే 4న ప్రారంభమై 7న ముగుస్తుంది. ఈ సమ్మర్ సేల్‌లో వివిధ రకాల ప్రొడక్టులపై అదిరిపోయే ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. ప్రైమ్ యూజర్లకు ఈ సేల్ మే 3 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమౌతుంది. సమ్మర్ సేల్‌లో భాగంగా శాంసంగ్, షావోమి, వన్‌ప్లస్, యాపిల్, రియల్‌మి వంటి వివిధ రకాల బ్రాండ్లకు చెందిన స్మార్ట్‌ఫోన్స్‌పై సూపర్ డీల్స్ పొందొచ్చు. ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులపై అదనంగా 10 […]

అమేజాన్‌ సమ్మర్ సేల్... 80 శాతం తగ్గింపు!
Follow us on

అమేజాన్ సమ్మర్ సేల్ మళ్లీ వచ్చేసింది. ఈ సేల్ మే 4న ప్రారంభమై 7న ముగుస్తుంది. ఈ సమ్మర్ సేల్‌లో వివిధ రకాల ప్రొడక్టులపై అదిరిపోయే ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. ప్రైమ్ యూజర్లకు ఈ సేల్ మే 3 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమౌతుంది.

సమ్మర్ సేల్‌లో భాగంగా శాంసంగ్, షావోమి, వన్‌ప్లస్, యాపిల్, రియల్‌మి వంటి వివిధ రకాల బ్రాండ్లకు చెందిన స్మార్ట్‌ఫోన్స్‌పై సూపర్ డీల్స్ పొందొచ్చు. ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులపై అదనంగా 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. మొత్తంగా కంపెనీ స్మార్ట్‌ఫోన్స్, మొబైల్ యాక్ససరీస్‌పై 40 శాతం వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.

షావోమికి చెందిన రెడ్‌మి వై3, రెడ్‌మి 7, రెడ్‌మి 6ఏ, రెడ్‌మి 6 ప్రో ఫోన్లపై ఆఫర్లు ఉండనున్నాయి. శాంసంగ్‌కు చెందిన గెలాక్సీ ఎం30, గెలాక్సీ ఎం20, గెలాక్సీ ఎం10, గెలాక్సీ ఎస్10 ఫోన్లపై కూడా అదిరిపోయే డీల్స్ ఉండొచ్చు. అలాగే వన్‌ప్లస్ 6టీ, రియల్‌మి యూ1, హానర్ 8ఎక్స్, వివో వీ15 ప్రో, హానర్ వ్యూ20, ఒప్పొ ఆర్17 వంటి వివిధ ఫోన్లపై ఆఫర్లు ఉండనున్నాయి. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్, నో కాస్ట్ ఈఎంఐ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.